ముంబై: మరాఠీ భాష మాట్లాడే కర్నాటకలోని కొన్ని జిల్లాలను తమ రాష్ట్రంలో విలీనం చేసుకుంటామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. మరాఠీ ప్రాంతాల విలీనం కోసం పోరాడి అమరులైన వారికి ఇదే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. కర్ణాటకలోని బెల్గావ్, కర్వార్, నిప్పణితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడుతారు. భాషా ప్రాతిపదికన చూస్తే ఇవన్నీ తమకే చెందాలని, వీటిని కర్నాటక ఆక్రమించిందని మహారాష్ట్ర వాదిస్తోంది. విలీనం కోసం పోరాడి 1956లో ప్రాణాలు కోల్పోయిన స్మరించుకోవడానికి మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి ఏటా జనవరి 17న ‘అమరుల దినం’గా పాటిస్తోంది. ‘‘మహారాష్ట్ర భాషతోపాటు మరాఠీల కల్చర్ఉండే కర్ణాటకలోని ప్రాంతాలను తప్పకుండా విలీనం చేసుకుంటాం. ఈ విషయంలో మేం చిత్తశుద్ధితో ఉన్నాం”అని చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆదివారం ట్వీట్ చేసింది. బార్డర్ఏరియాలు ఎవరికి చెందాలనే విషయమై సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్లో ఉంది. ఈ కేసు విచారణను ఎప్పటికప్పుడు పరిశీలించే బాధ్యతను సీఎం ఇద్దరు మంత్రులకు అప్పగించారు.
