వ్యాక్సిన్‌‌లకు భారత్‌ అనుమతివ్వడం శుభపరిణామం

వ్యాక్సిన్‌‌లకు భారత్‌ అనుమతివ్వడం  శుభపరిణామం
దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్‌‌లు అత్యవసర వాడకానికి డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీరం ఇన్‌‌స్టిట్యూట్ రూపొందించిన కొవిషీల్డ్‌తోపాటు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్‌‌లకు ఎక్స్‌‌పర్ట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో) హర్షం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మీద పోరాటాన్ని బలోపేతం చేసేందుకు తాము సాయపడతామని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వాడకంతోపాటు ఇతర ప్రజారోగ్య చర్చలు చేపట్టడం, నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ప్రభావాన్ని తగ్గించొచ్చని డబ్ల్యూహెచ్‌వో సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు.