రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోండి. లేదంటే మిమ్మల్ని పాతిపెట్టేస్తానంటూ మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ చేసిన హాట్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన మయ్యాయి. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫితో పాటు ఇంకెవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడితే భూమిలోపల పది అడుగుల్లోతు పాతిపెట్టేస్తానంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా మంచి పరిపాలన అందించడమే తమ ధ్యేయమని మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహార్ స్పష్టం చేశారు. .
