- వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో ఘటన
వికారాబాద్, వెలుగు : మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ తన భర్తను బండరాయితో మోది హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. స్థానికులు, యాలాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలో గల ఇందిరమ్మ కాలనీలోని ఇంటి నంబర్ 15లో మహ్మద్ ఖాజా (31) ఆయేషా దంపతులు ఉంటున్నారు.
ఖాజా పాత సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన ఖాజా నిత్యం తాగొచ్చి భార్యను కొట్టేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా భార్య, పిల్లలను కొట్టడంతో గొడవ జరిగింది. దీంతో ఖాతా తండ్రి అబ్దుల్ నవాబ్ వచ్చి నచ్చజెప్పి వెళ్లాడు. ఖాజా సోమవారం మరోసారి ఆయేషాను కొట్టడంతో ఆగ్రహానికి గురైన ఆమె బండరాయితో కొట్టి ఖాజాను హత్య చేసింది. మృతుడి తండ్రి అబ్దుల్ నవాబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.