భార్య చేసిన అప్పు.. భర్త ప్రాణం తీసింది.. నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఏం జరిగిందంటే..

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: భార్య చేసిన అప్పు భర్త ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పు తీర్చకపోతే ఇంటికి తాళం వేస్తానని డబ్బులు ఇచ్చిన వ్యక్తి బెదిరించడాన్ని అవమానంగా భావించిన హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా తాడూరు మండలంలో ఆదివారం జరిగింది. మండలంలోని ఏటిదరిపల్లికి చెందిన గున్న ముత్యాలు (55) జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అటెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య రజిత గతంలో తెలిసిన వ్యక్తి వద్ద రూ.1.50 లక్షలు అప్పు తీసుకుంది. ఆ డబ్బులు చెల్లించాలని అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి పెంచాడు.

శనివారం ఇంటికి వెళ్లి తాళం వేస్తానని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ముత్యాలు ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన చుట్టుపక్కల వారు ముత్యాలును జిల్లా జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ ఆదివారం ఉదయం చనిపోయాడు. మృతుడి తల్లి అంజనమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.