క్రిస్మస్‌ను ఎందుకు జాతీయ సెలవుదినంగా ప్రకటించలేదు?

క్రిస్మస్‌ను ఎందుకు జాతీయ సెలవుదినంగా ప్రకటించలేదు?
క్రిస్మస్‌ పండుగను ఎందుకు జాతీయ సెలవుదినంగా ప్రకటించలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం.. దేశంలో మతవిద్వేష రాజకీయాలు చేస్తుందని ఆమె మండిపడ్డారు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలోని అలెన్ పార్క్‌లో జరిగిన క్రిస్మస్ కార్నివాల్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘యేసుక్రీస్తు పుట్టినరోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని నేను గతంలోనే చెప్పాను. క్రైస్తవులు ఏ హాని చేశారని క్రిస్మస్ సెలవును జాతీయ సెలవుదినంగా ప్రకటించడంలేదు? దేశంలో లౌకికవాదం ఉందా? దేశంలో మత విద్వేష రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రోజు దీనిని ఖండించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ మనోభావాలు ఉంటాయి. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈసారి కరోనా మహమ్మారి కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం మనం మాస్కులు ధరించి.. సామాజిక దూరాన్ని పాటించాలి’ అని ఆమె తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు ముందే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు కుమ్ములాడుకుంటున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. కాగా.. నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా ప్రకారం క్రిస్మస్ పండుగ గెజిటెడ్ హాలిడే. కేవలం జనవరి 26, ఆగష్టు 15, గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2ను మాత్రమే దేశంలో నేషనల్ హాలిడేస్‌గా పరిగణిస్తారు. మిగతా అన్ని పండుగలను అంటే దీపావళి, దసరా, సంక్రాంతి, బక్రీద్ మొదలైన పండుగలను గెజిటెడ్ హాలిడేస్‌గానే పరిగణిస్తారు. మరి వీటన్నింటికి లేనిది కేవలం క్రిస్మస్‌ను మాత్రమే నేషనల్ హాలిడేగా ఎలా ప్రకటిస్తారని బీజేపీ నాయకులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. For More News.. రొట్టెలు తిని ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన అయిదుగురు మృతి మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన అమెరికా