బ్యాగులకు రెండు జిప్పులు ఎందుకు ఉంటాయో తెలుసా..

బ్యాగులకు రెండు జిప్పులు ఎందుకు ఉంటాయో తెలుసా..

పిల్లల దగ్గరినుంచి వృద్దుల వరకు ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలన్నా బ్యాగులనే ఉపయోగిస్తున్నారు.  స్కూలు బ్యాగులు, ట్రావెలింగ్ బ్యాగులు, లంచ్ బ్యాగులు, మహిళలు ఉపపయోగించే హ్యాండ్ బ్యాగ్ లు  ఇలా రకరకాల బ్యాగులు అనేక మోడల్స్ లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి.  అయితే ఏ బ్యాగునైనా  క్లోజ్ చేసేందుకు జిప్ ఉటుంది.  ఈ జిప్పర్లు రెండు ఉంటాయి.  అయితే  మీరు చిన్నప్పటి నుండి  బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ మీకు తెలియని వాటికి సంబంధించిన ఒక విషయం ఉంది. బ్యాగుల జిప్కు రెండు హుక్స్ ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

సహజంగా ఏ బ్యాగ్ జిప్ను చూసినా రెండు హుక్స్ ఉంటాయి.  బ్యాగ్ యుటిలిటీ జిప్ లపై ఆధారపడుతుంది.  రెండు జిప్ హుక్స్ లు ఉండటం వలన  ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చని బ్యాగుల తయారీ నిపుణులు చెబుతున్నారు.  ఒక జిప్ హుక్  పాడైతే, బ్యాగ్‌ని మరొక జిప్ హుక్  ఉపయోగించి వాడుకోవడానికి వీలు కలుగుతుంది.  

రెండు జిప్‌లు బ్యాగ్‌ను గట్టిగా  ఉంచుతాయి.  బ్యాగులో వేసే సామాను ఎక్కువుగా ఉంటే బరువు జిప్ పై పడుతుంది.  ఒకే జిప్ను వాడటం వలన అది దెబ్బతినే అవకాశాలు  మెండుగా ఉన్నాయి. అప్పుడు రెండు జిప్ లను  దగ్గరిగా తీసుకొచ్చినప్పుడు వాటికీలు కలుస్తాయి.  అప్పుడు చిన్న తాళం ఉపయోగించి లాక్ చేయవచ్చు. ఈ రోజుల్లో, అనేక సూట్‌కేస్‌లు నంబర్ సిస్టమ్ ద్వారా మూసివేయబడిన జిప్‌ను అటాచ్ చేసే ఎంపికను కలిగి ఉన్నాయి. అందుకే కస్టమర్ల అవసరాన్ని బట్టి బ్యాగు తయారీ దారులు జిప్ లకు రెండు హుక్ లను ఏర్పాటు చేస్తున్నారన్నమాట.