స్ట్రీమ్ ఎంగేజ్.. మిస్టరీని ఛేదించారా?

స్ట్రీమ్ ఎంగేజ్.. మిస్టరీని ఛేదించారా?

మిస్టరీని ఛేదించారా?
టైటిల్ : ఒరు కొడై మర్డర్ మిస్టరీ
డైరెక్షన్​ : విశాల్ వెంకట్
కాస్ట్ : అభిరామి, నిఖిల్ నాయర్, ఆకాశ్, నమ్రత ఎం.వి.
రన్​ టైం : ఎనిమిది ఎపిసోడ్లు (దాదాపు 30 –40నిమిషాలు)
ప్లాట్ ఫాం : జీ5
లాంగ్వేజ్ : తమిళం, తెలుగు

కొడైకెనాల్​లోని ఒక స్కూల్​లో ఒక స్టూడెంట్ బ్యాచ్ ఉంటుంది. అందులో వ్యోమ్ వరదరాజ్​, తార అనే ఇద్దరు టీనేజర్స్ చాలా తెలివైనవాళ్లు. వాళ్లిద్దరూ కలిసి క్విజ్ పోటీల్లో పాల్గొనేవాళ్లు. ఒకరోజు తార హత్యకు గురవుతుంది. ఆమెను ఎవరు చంపారనేది తెలుసుకోవడమే ఈ సిరీస్​ కథాంశం. అయితే, ఇంట్రెస్టింగ్​ పాయింట్ ఏంటంటే... ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్​ని పోలీసులు కాకుండా తార ఫ్రెండ్స్​ డీల్ చేస్తారు. హత్యకు గల కారణాలు తెలుసుకున్నారా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సిరీస్​ చూడాల్సిందే. ఈ సిరీస్​లో స్టూడెంట్స్ టెక్నాలజీని బాగా వాడారు.

కొన్నిచోట్ల వాస్తవానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సిరీస్​లో చెప్పుకోదగ్గ విషయం వ్యోమ్ క్యారెక్టర్​. గతంలో జరిగిన సంఘటనలు తనపై ఎలాంటి ప్రభావం చూపించాయి అనే విషయాలు ఇంట్రెస్టింగ్​గా ఉంటాయి. చివరి ఎపిసోడ్​ ఈ సిరీస్​కి హైలైట్. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్టూడెంట్స్ నటన బాగుంది. ఈ సిరీస్​ చూడాలంటే చాలా ఓపిక అవసరం.

కాలేజీ పాలిటిక్స్​

టైటిల్​ : గర్మీ, డైరెక్షన్​ : టిగ్మాన్షు ధూలియ
కాస్ట్ : వ్యోమ్​ యాదవ్​, దిషా ఠాకూర్​, ముకేష్​ తివారీ, అనురాగ్ ఠాకూర్​, వినీత్​ కుమార్​, అనుష్క కౌషిక్​,  పంకజ్​ సరస్వత్​, పునీత్ సింగ్
లాంగ్వేజ్ : హిందీ

ప్లాట్​ ఫాం : సోనీలివ్​

రన్​ టైం : 9 ఎపిసోడ్లు.. ఒక్కోటీ 40 నుంచి 45 నిమిషాలు
అరవింద్​ శుక్లా(వ్యోమ్​ యాదవ్​) లాల్‌గంజ్‌ అనే ఊళ్లో ఒక మిడిల్​ క్లాస్​ కుటుంబంలో పుట్టిన కుర్రాడు. చదువు కోసం అలహాబాద్‌లోని త్రివేణిపూర్ యూనివర్సిటీ వెళ్తాడు. అతను చిన్నప్పటినుంచి హిందీ మీడియంలో చదువుకుంటాడు. అందుకే ఇంగ్లిష్​ పెద్దగా తెలియక ఇబ్బంది పడుతుంటాడు. యూనివర్సిటీలో తనతోపాటు చదువుతున్న సురభి గౌతమ్ (దిషా ఠాకూర్)తో ప్రేమలో పడతాడు. అదే టైంలో యూనివర్సిటీలో రెండు ముఠాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒక ముఠాకు బిందు సింగ్ (పునీత్ సింగ్) లీడర్. మరో ముఠాకు గోవింద్ మౌర్య (అనురాగ్ ఠాకూర్) లీడర్​. అయితే.. అనుకోకుండా వీళ్ల గొడవల్లో శుక్లా ఇరుక్కుంటాడు.

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక పోలీస్​ ఆఫీసర్​ మృత్యుంజయ్ సింగ్‌(జతిన్ గోస్వామి) శుక్లా వెంటపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. వ్యోమ్ యాదవ్ బాగా నటించాడు. స్క్రీన్​ ప్లే బాగుంది. ఎక్కడా విసుగు తెప్పించదు. కాకపోతే.. పాత్రల డిజైనింగ్​ ఇంకాస్త బెటర్​గా చేస్తే బాగుండేది. సిరీస్​లో అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. పోలీస్​ ఆఫీసర్​గా నటించిన జతిన్ గోస్వామి నటన స్పెషల్​ ఎట్రాక్షన్​. 

నైన్టీస్ కిడ్స్

టైటిల్ : నైన్టీస్ కుర్రాడు, 
డైరెక్షన్​ : శశి హాస్, 
కాస్ట్ : చందు సాయి, భవ్య శ్రీ ఉప్పలపాటి, సత్య ప్రసాద్, సాయి కిశోర్, శశి హాస్ కోనేటి
రన్​ టైం : ఎనిమిది ఎపిసోడ్లు (దాదాపు 30 –40 నిమిషాలు)
యూట్యూబ్ ఛానెల్ : ఇన్​ఫినిటమ్​ మీడియా, 
లాంగ్వేజ్ : తెలుగు

నైన్టీస్​ జనరేషన్ వాళ్లంతా డైలీ లైఫ్​లో జరిగిన చాలా ఇన్వెన్షన్స్ చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాజమౌళి డైరెక్ట్ చేసిన సీరియల్ నుంచి ఆర్.​ఆర్.​ఆర్.​ వరకు అంచెలంచెలుగా ఎదిగిన తీరు చూసి విజిల్స్ వేసిన బ్యాచ్ వీళ్లు. ఇన్ని చూసిన వీళ్లు లైఫ్, కెరీర్​ విషయంలో మాత్రం అస్సలు క్లారిటీ లేకుండా బతికేస్తుంటారు. దానికి ఉదాహరణను లైవ్​లో చూపిస్తూ.. ఈ కథలో చందు పాత్రను పరిచయం చేస్తారు. అలా మొదలైన మొదటి ఎపిసోడ్​ నైన్టీస్​ కామెడీతో బాగానే పండించారు. ఇందులో చందు అనే వ్యక్తి మొదట అందరిలాగే చదువు పూర్తి చేసి, జాబ్​లో చేరతాడు.

కొన్నాళ్లకు బోర్​ కొట్టి జాబ్​ మానేస్తాడు. అప్పటికే తను ఒక అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఆ అమ్మాయి ఒకరోజు చందు వాళ్ల నాన్న దగ్గరకి వెళ్లి, తన కొడుకు జాతకం చూపిస్తుంది. వాళ్లకు పెండ్లయితే అదృష్టం కలిసి వస్తుంది. అంతా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంది. కానీ, తన ఇంట్లో వాళ్లని ఒప్పించాలంటే చందు జాబ్​ చేయాలని చెప్పి వెళ్తుంది. ఆ విషయం చందు వాళ్ల నాన్న, కొడుక్కి చెప్తే, ‘ససేమిరా జాబ్ చెయ్యను నాన్నా’ అని తేల్చి చెప్తాడు. మొదటి ఎపిసోడ్ సరదాగా మొదలై, ట్విస్ట్​తో ముగించారు. తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్​ ఫాలో కావాల్సిందే.