Allu Arjun Trivikram: మాస్టర్ ప్లాన్లో త్రివిక్రమ్.. అల్లు అర్జున్ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు ఇతడే!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చేసింది. అప్పటినుండి మొదలైన అంచనాలు ఓ ఎత్తయితే.. ఇపుడు పుష్ప 2 రిలీజ్ తర్వాత మరో ఎత్తు.

పుష్ప 2 రికార్డ్ కలెక్షన్స్ తో అల్లు అర్జున పవర్.. ప్రపంచ సినిమా ఇండస్ట్రీస్కి తెలిసిపోయింది. దాంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్పై మరింత బాధ్యతను పెంచిందనే చెప్పుకోవాలి. మరి ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేది ఎప్పుడు? సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ ఎవరు? కథ ఎలాంటిది? ఇలాంటి పలు లేటెస్ట్ విషయాలు తెలుసుకుందాం. 

ఇప్పటికే త్రివిక్రమ్ కథను సిద్ధం చేసుకుని ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఒక ప్రయోగాత్మకమైనా పీరియాడికల్ డ్రామా జోనర్లో ఫాంటసీ మూవీగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తారని సమాచారం. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. స్వాతంత్రం రాకముందే జరిగే కొన్ని అంశాలను హ్యూమన్ టచ్తో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటివరకి త్రివిక్రమ్ మూవీస్లో డైలాగ్స్ లోనే ఎక్కువ మీనింగ్స్ తెలుసుకున్నారు ఆడియన్స్. ఇక అల్లు అర్జున్తో తీయబోయే మూవీతో.. స్టోరీ గురించి డిస్కస్ చేసేలా..నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, త్రివిక్రమ్ పెన్ను పవర్ టాలీవుడ్కి మాత్రమే తెలుసు తన స్టామినా ఏంటనేది! ఇక ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో తన పెన్ను పవర్ను చూపించడానికి రెడీ అయ్యాడట. అందుకోసం ఈ సినిమాకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దింపుతున్నట్లు లేటెస్ట్ టాక్.

ఆస్కార్ దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ తర్వాత అత్యంత పాపులారిటీ సొంతం చేసుకున్న హ్యారిస్ జైరాజ్ని సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, గురూజీ ఇన్నాళ్లు దేవిశ్రీ ప్రసాద్, తమన్ లతో ఎక్కువ సినిమాలు చేశాడు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ కోసం హ్యారిస్ జైరాజ్ అయితేనే న్యాయం చేయగలడు అనే ఉద్దేశ్యంతో కొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. అయితే, తమన్ ని కూడా ఎంచుకునే ఛాన్స్ లేకపోలేదు.

అంతేకాకుండా అల్లు అర్జున్ కు జోడీగా బాలీవుడ్ నెం.1 హీరోయిన్ దీపికా పదుకునే (Deepika Padukone) ను  సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో కీలక పాత్రలో పూజా హెగ్డే కూడా కనిపిస్తుందని టాక్. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.   

ఈ సినిమాని గీత ఆర్ట్స్ (Geetha arts), హారికా హాసిని క్రియేషన్స్(Haarika hassine creations) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టును త్రివిక్రమ్ 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది.