చాహల్ - ధనశ్రీ సంసారంలో చిచ్చు.. ఎవరీ ప్రతీక్ ఉటేకర్..?

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల దిశగా పయనిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ అనూహ్య పరిణామాల నడుమ ధనశ్రీ మరొక వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అతని వల్లే ఈ జంట విడిపోయారని సమాచారం. ఆ పుకార్లకు ఆజ్యం పోసేలా ధనశ్రీ మరొకరితో క్లోజ్‌గా ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 

చాహల్ సతీమణి కొన్ని నెలల కిందట తన ఫ్రెండ్ ప్రతీక్ ఉటేకర్‌తో కలసి కొన్ని ఫొటోలు దిగింది. వాటిలో ఒక దానిలో వారిద్దరూ చాలా సన్నిహితంగా కనిపించారు. ఏదో పార్టీకి హాజరైనట్టు ఇద్దరూ నల్లటి దుస్తులు ధరించి ఉన్నారు. పోనీ అక్కడితో వీరి చనువు ఆగిందా అంటే లేదు. రొమాంటిక్ యాంగిల్ ఎక్కువయ్యింది. ప్రతీక్ ఉటేకర్‌.. ధనశ్రీ నడుమ చుట్టూ చేతులేసి దగ్గరగా హత్తుకున్నట్లు ఉంది. దాంతో, ఈ ఫోటో ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరీ ప్రతీక్ ఉటేకర్?

23 ఆగస్ట్ 1990న జన్మించిన ప్రతీక్ ఉటేకర్, ముంబై నివాసి. భారతీయ రియాలిటీ టీవీ ఇండస్ట్రీలో పాపులర్ కొరియోగ్రాఫర్. సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, నోరా ఫతేహిలతో సహా బాలీవుడ్‌లోని ప్రముఖులకు కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. చాహల్‌ను మనువాడక ముందు ధనశ్రీ ఇతనితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

చాహల్ క్రికెట్ పిచ్చి..

విడాకుల విషయంలో ధనశ్రీపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికీ, కొందరు చాహల్‌ను విమర్శిస్తున్నారు. భార్యకు సమయం కేటాయించలేనంత తీరికలేని క్రికెట్ ఆడుతున్నప్పుడు.. ఆమెను మనవాడటం ఎందుకన్న విమర్శలు అతనిపై వస్తున్నాయి. ఈ భారత క్రికెటర్.. ఐపీఎల్, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్, దేశవాళీ క్రికెట్ అంటూ తీరికలేని సమయాన్ని గడుపుతుండటంతోనే ఆమె మరొకరి దగ్గరయ్యిందన్న పిచ్చ పిచ్చ కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి.