తిరుమల పుణ్యక్షేత్రం...ఎంతో మహిమాన్వితం గల దేవాలయం. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. తిరుమల స్వామిని వజ్రవైఢూర్యాలు.. బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ప్రాంతంలోనే వేంకటేశ్వరస్వామి వెలియుటకు కారణం ఏమిటి..ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు.. ఎందుకు నిర్మిచారు.. పురాణాల్లో ఏముందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. . .
ఏడు కొండలవాడ... వేంకటరమణ.. గోవిందా.. గోవిందా.. ఆపద మొక్కుల వాడా.. వడ్డీ కాసుల వాడా.. గోవిందా.. గోవిందా అని తిరుమల కొండ మారుమ్రోగుతుంది. సాక్షాత్తూ.. విష్ణుమూర్తే వేంకటేశ్వరుని రూపంలో.. ఏడు కొండలపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. వీకెండ్ వచ్చిదంటే చాలు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. స్వామిని దర్శించుకునేందకు భక్తులు తండోపతండలుగా వెళ్తుంటారు. అయితే తిరుమల స్వామి దర్శనం కలగాలంటే ఆషామాషీ కాదు. ఒక్కోసారి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంతటి మహిమాన్వితం గల దేవాలయాన్ని ఎవరు నిర్మించారు.. ఎందుకు నిర్మించారు.. ఎప్పుడు నిర్మించారు.
తిరుమల దేవాలయాన్ని నిర్మించినది ఎవరు?
తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించినది తొండమాన్ చక్రవర్తి అని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. తొండమాన్ చక్రవర్తి ...ఆకాశరాజు సహోదరుడు. 1500చరిత్ర ప్రకారం పల్లవ రాణి క్రీ.శ.614లో ఆనంద నిలయం పునరుద్దరణ చేసారు.
స్వామి ఉత్సవ ఆభరణాలు
స్వామి ఉత్సవాలు, ఆభరణాలు యువరాణి సమర్పించినదని పురాణాలు చెబుతున్నాయి. చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచివుంది.ఆ యువరాణిని పరుందేవి అని కూడా పిలుస్తారు.19వ శతాబ్ధం చివరిలో స్వామిదేవాలయం , హతిరామ మటం మాత్రమే నిర్మించారు. ఇక కొండపై ఎలాంటి కట్టడాలు కూడా లేవు. అర్చకులు కూడా కొండ దిగువ భాగంలో ఉండే గదుల్లో నివసించేవారు. రోజూ ఉదయం వెళ్లి .. సాయంత్రం వచ్చేవారు.
కలలో కనపడి....
.ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించినది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్.ఇతనికి ఒక రోజు విష్ణుమూర్తి కలలో కనపడి... గత జన్మలో నీవు రంగదాసు అనే పేరుతో పిలవబడి,నా భక్తుడై వున్నాను"అని చెప్పాడట. నీవు అక్కడ దేవాలయం దేవాలయం నిర్మించమని కలలోనే ఓ ప్రదేశాన్ని స్వామివారే చూపించారని.. నాకు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేయమని సలహా ఇచ్చి అంతర్దానమయ్యారని పురాణాలు చెబుతున్నాయి.
దేవాలయం నిర్మాణం
విష్ణు పురాణం ప్రకారం.. తిరుమల శేషాచల కొండపై వేంకటేశ్వరస్వామి వెలిసి యున్నాడని.. కలియుగం అంతం అయేంతవరకు అక్కడే ఉంటానని... నీవు అక్కడే దేవాలయాన్ని నిర్మించాలని ఆ స్వామి చెప్పాడట. .దీనికి సంతోషించిన తొండమాన్ రాజు విశ్వకర్మను పిలిచి దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు.
ఇతర రాజవంశీకులు
తొండమాన్ ... ఆకాశరాజు సహోదరుడు. ఇతని అనంతరం చోళులు, పల్లవులు, విజయనగరరాజులు మొదలైనవారు దేవాలయం అభివృద్ధికి కృషిచేశారు.ఈ దేవాలయంలో ఆస్వామి అలంకారానికి ఖర్చు బంగారు ఆభరణాలు సుమారు 12 కెజీలు అప్పట్లో సమకూర్చారు .ఈ స్వామికి అలంకారం చేయాలంటే ఒక్కరితో అయ్యేపనికాదు.
స్వామికిరీటం
దేవాలయంలో వుండే స్వామి కిరీటం నీలిరంగులో వుండిన వజ్రాలతోకూడి ఉంటుంది. న ప్రపంచంలో ఎక్కడాచూడనటువంటి కిరీటం. దీని ధర ఎన్నో లక్షల కోట్లవిలువచేస్తుంది. శ్రీ కృష్ణదేవారాయలు తిరుమలను పరిపాలించిన 21 సంవత్సరాలూ స్వర్ణ యుగం అని చెప్పవచ్చు.ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వెలకట్టలేనంత వజ్రాలు మొదలైనవాటి నుంచి ధగధగామెరిసిపోయే వజ్రాల కిరీటాన్ని స్వామికి అర్పించెను.
స్వర్ణయుగం
12వశతాబ్దంనుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణయుగం ప్రారంభమైంది. ఆ సమయంలో అనేక కిరీటాలు స్వామికి సమర్పించారు. మూలవిరాట్ కి 6కిరీటాలు, ఉత్సవమూర్తికి 7 కిరీటాలు,20 ముత్యాలహారాలు, స్వర్ణపీపీఠాలు, స్వర్ణపాదాలు, లెక్కలేనన్ని బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించారు.
వేంకటేశ్వరస్వామి భూలోకంలో వెలయుటకు కారణం ఏమిటి?
పురాణకథ ప్రకారం ..పూర్వం నారదముని భూ లోకంలో మానవులకు భగవంతునిమీద నమ్మకం, భక్తి, విశ్వాసాలు లేకుండా పాపభీతి లేకుండా జీవిస్తున్నారని చెప్పెను.అందుకు శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా వెలుస్తానని చెప్పెను.
మరొక కథ ప్రకారం.... శ్రీ కృష్ణుని నిజమైన తల్లిదండ్రులైన దేవకి,వసుదేవులు. అయితే శ్రీకృష్ణుడు కారణజన్ముడుకావటంచేత యశోదదగ్గర పెరుగుతాడు. శ్రీకృష్ణుడు పెరిగిపెద్దవాడైన తరవాత రుక్మిణిని వివాహం చేసుకుంటాడు.అయితే ఆ వివాహాన్ని యశోద చూసి తరించాలని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు కలి యుగంలోవేంకటేశ్వరుడై వెలసి తన వివాహ సంబరంలో (యశోదమాతను) వకుళాదేవిగా వివాహాన్ని చూసి ఆనందించమని చెప్తాడు.
ఇంకొక కథ ప్రకారం.... వేదవతి శ్రీ మహావిష్ణువును వివాహంచేసుకోవాలని తన తండ్రితో విన్నవించింది.తదనంతరం శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేసింది.ఆ సమయంలో రావణుడు వేదవతిని అపహరించాలని చూస్తాడు. వేదవతి రావణునికి నీవు నీ లంకలోనే ఒక స్త్రీ మూలకంగా నాశానమౌతావు"అని శపించెను.
సీతామాతను అపహరించిన రావణుడు మాయ సీతయైన వేదవతిని లంకలో బంధిస్తాడు. రావణున్ని సంహరించినఅనంతరం మాయ సీతయైన వేదవతి తనను వివాహంచేసుకోవాలని వేడుకుంటుంది. ఏకపత్ని వ్రతాన్ని అనుసరించిన రాముడు కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా పుట్టి పద్మావతియైన నిన్ను ఆ సందర్భంలో వివాహంచేసుకుంటానని చెప్పాడని పండితులు చెబుతున్నారు.