రూ. 31 లక్షలకు బిట్‌కాయిన్..
చిన్న క్రిప్టోలకు దూరంగా ఉండాలని సలహా
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్ దూసుకుపోతుండడంతో మిగిలిన క్రిప్టో కరెన్సీలను ఆర్టిఫిషియల్‌గా పెంచుతున్న అకౌంట్లను ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలు గుర్తిస్తున్నాయి. శుక్రవారం సెషన్‌లో బిట్‌కాయిన్ వాల్యూ 41,421 డాలర్ల(రూ. 31 లక్షల)కు చేరుకుంది. ఈ ఊపులోనే చిన్న క్రిప్టో కరెన్సీలను ఆర్టిఫిషియల్‌గా పెంచుతూ, రిటైల్ ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న నాలుగు అకౌంట్లను గుర్తించామని క్రిప్టోఎక్స్చేంజి కాయిన్‌డీసీఎక్స్ పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో క్రిప్టో ట్రేడింగ్‌ను కంట్రోల్ చేసేందుకు ఎటువంటి రెగ్యులేషన్ లేదా కేవైసీ రూల్స్ లేవు. క్రిప్టో ఎక్స్చేంజిలే ముందుకొచ్చి తమ రూల్స్‌ను అమలుచేస్తున్నాయి.
యాంటి మనీలాండరింగ్ పాలసీలకు విరుద్ధంగా అనిపించిన కొన్ని అకౌంట్లను దర్యాప్తు చేస్తున్నామని బిటెక్స్ పౌండర్ మోనార్క్ మోడి అన్నారు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఈ అకౌంట్ హోల్డర్లను అడుగుతున్నామని పేర్కొన్నారు. తమ ఎక్స్చేంజిలో క్రిప్టో ట్రేడింగ్ రూల్స్‌కు తగ్గట్టు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏం తెలియకుండా చిన్న క్రిప్టో కరెన్సీలలో రిటైల్ ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టొద్దని కాయిన్‌డీసీఎక్స్ ఫౌండర్ నీరజ్ ఖండెల్వాల్ అన్నారు. స్మాల్ క్యాప్ క్రిప్టో కాయిన్‌లు పెన్నీ స్టాకులానే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాయని చెప్పారు.
కానీ ఈ కాయిన్‌లను కొనే ముందు ఇన్వెస్టర్లు తగినంత రీసెర్చ్ చేయాలని సలహా ఇచ్చారు. తక్కువ వాల్యూమ్స్ ఉన్న చిన్న క్రిప్టోకరెన్సీలను ఆర్టిఫిషియల్‌గా పెంచుతున్న నాలుగు అకౌంట్లను గుర్తించామని, వీటిని నిలిపేశామని చెప్పారు.కాగా, లాంగ్ టెర్మ్‌లో బిట్‌కాయిన్ వాల్యూ రూ. కోటి(1.46 లక్షల డాలర్లు) దాటగలుగుతుందని జేపీ మోర్గాన్ అంచనావేసింది. ప్రస్తుతం 575 బిలియన్ డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ ఈ ధర వద్ద 4.6 రెట్లు పెరిగి 2,645 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనావేసింది.
