ఏపీలో 4 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటీవ్ కేసులు

ఏపీలో 4 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటీవ్ కేసులు

రాష్ట్రంలో శుక్ర‌వారానికి క‌రోనా కేసులు 4లక్ష‌ల దాటాయి. అందులో 3ల‌క్ష‌ల‌కు పైగా బాధితులు వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఇక గ‌డిచిన 24గంటల్లో 10,526కేసులు న‌మోదు కాగా..81మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,714కి చేరుకుంద‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. గ‌డిచిన 24గంట‌ల్లో 8463కి క‌రోనా త‌గ్గి ఆస్ప‌త్రి నుంచి డిశార్జ్ అయిన‌ట్లు అధికారులు బులిటెన్ విడుద‌ల చేశారు.

అలాగే కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో – 10 , కడపలో- 9 , కర్నూలులో – 6, అనంతపురంలో – 5, నెల్లూరులో- 8 , ప్రకాశంలో- 8 , గుంటూరులో – 4 ,కృష్ణాలో – 5, తూర్పు గోదావరిలో – 6, పశ్చిమ గోదావరిలో- 8 , విశాఖలో – 6 , శ్రీకాకుళంలో – 5, విజయనగరంలో – ఒక‌రు మ‌ర‌ణించారు.