సెల్ఫీల మోజు.. రైలు ఢీకొని యువకుడు మృతి

సెల్ఫీల మోజు.. రైలు ఢీకొని యువకుడు మృతి

సెల్ఫీ తీసుకుంటుండుగా రైలు ఢీకొని యువకుడు మరణించిన ఘటన  ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఆదివారం ( జులై 30) చోటు చేసుకుంది.   ధీష్‌ ఆలయాన్ని దర్శించుకున్న ముగ్గురు స్నేహితులు తివారిపురం వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జీ వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటుండగా ఆ ఆ బ్రిడ్జీపై రైలు వస్తుంది. దీనిని  గమనించిన ముగ్గురు యువకులు బ్రిడ్జీ చివరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ట్రైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు యువకులు  తప్పించుకోగా ఒకరిని రైలు ఢీకొట్టింది. గాలిలో ఎగిరిపడిన యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడ్ని 18 ఏళ్ల వంశీగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రైలు పట్టాలు, రైల్వే బ్రిడ్జీలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని పోలీసులు సూచించారు.

అయితే సెల్ఫీ మరణాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. సెల్ఫీలు తీసుకునే సందర్భాల్లో జరిగిన ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. 2011 నుంచి 2017 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 259 సెల్ఫీ మరణాలు నమోదయ్యాయి. వాటిలో 60 శాతానికి పైగా అంటే 159 సెల్ఫీ మరణాలు భారత్‌లో సంభవించాయి.