చాలామంది భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు, అరటి పండ్లు, ఆపిల్స్ తదితరాలు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు.ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అరటి పండు, నారింజ పండ్లు, యాపిల్ వంటివి నైవేద్యంగా పెడతారు. అయితే ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే శుభ ఫలితం కలుగుతుందో తెలుసా?
దేవుడు.. పూజలు.. ఒక్కొక్కరు ఒక్కోరకంగా దేవుడిని ఆరాధిస్తారు. తమ శక్తికొలది భక్తితో దేవుడిని ఆరాధించడం చేస్తారు. పూర్వకాలం నుంచి మనం దీనికి సంబంధించి అనేక కథనాలు వింటూనే ఉన్నాయి. పురాణాలలో, ఇతిహాసాలలో కూడా వీటికి సంబంధించిన గాథలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు కన్నప్ప తను తినే మాంసాహారాన్ని దేవుడికి సమర్పించాడు. శబరి తను తినే పండ్లను రామచంద్రడికి సమర్పించంది. ఇలా ఒక్కో భక్తుడు ఒక్కొ రకం. అయితే ఆయా నైవేద్యాల సమర్పణ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
వినాయకుడు:బొజ్జగణపయ్య వినాయకుడికి లడ్డూలు, కుడుములన్నా మహా ప్రీతి.విఘ్నేశ్వరుడిని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా ఆ పదార్థాలనే ఉంచుతారు. పురాణాల ప్రకారం మోదకం తిన్న వారికి కళలు, రచనల మీద ఆధిపత్యం ఉంటుందట.జామపండు గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది.మామిడి పండు బకాయిలు వసూలు, ఇక గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి.
శివుడు: అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు. భక్తి శ్రద్ధలతో చేసే కొద్ది నైవేద్యంతో కూడా సంతృప్తి చెందే దేవుడు శివుడు. పాలు లేదా పాలతో చేసిన ఏదైనా స్వీట్ నీలకంఠుడుకు చాలా ఇష్టం. శివునికి సమర్పించే అత్యంత ప్రసిద్ది చెందిన ప్రసాదం భాంగ్. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అనే పంచామృతాలతో ఆయన్ని పూజిస్తారు. వీటిని సమపాళ్లలో కలిసి శివుడికి సమర్పిస్తారు.ఇంకా కుంకుమపువ్వుని కలిపి చేసిన ఆహారపదార్థాలు, తియ్యటి వంటకాలన్న ఆయన ఇష్టపడతాడు.
లక్ష్మీదేవి:సంపదనిచ్చే అదృష్ట దేవత లక్ష్మీదేవి. ..బియ్యంతో చేసే ఏ ప్రసాదం అయినా అమ్మవారికి నచ్చుతుంది. అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మిదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలను పూజలో పెడతారు.బియ్యంతో చేసిన ఖీర్ ను లక్ష్మిదేవి ఇష్టంగా స్వీకరిస్తారు.
నారాయణుడు:మహావిష్ణువుకు పసుపు కాయ ధాన్యాలంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడట.ఇంకా వీటికి కొంచెం బెల్లంకలిపి చేసిన వంటకాలైతే ఇక చెప్పనక్కర్లేదు.అందుకే విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించేటప్పుడు పసుపు వర్ణంగల లడ్డూలను ఆయనకు నైవేద్యంగా పెడతారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా నారాయణ స్వరూపమే.. అందుకే తిరుపతి లడ్డు ప్రసాదాన్ని వినియోగిస్తారని పండితులు చెబుతున్నారు.
సరస్వతి దేవి:చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో, మంచి బుద్ధి, చదువు ప్రసాదించాలని ఖిచిడీని నైవేద్యంగా ఉంచుతారు.
దుర్గాదేవి: ప్రపంచాన్ని రక్షిస్తున్న, శివుడు భార్య అయిన దుర్గామాతను పూజించడానికి కిచిడీ లేదా తియ్యటి ఖీర్ ను పూజకు ఉపయోగిస్తారు.దుర్గాదేవికి ఆ పదార్థాలంటే ఇష్టమట.
కాళికామాత: ధైర్యం,బలాన్నిచ్చే కాళికామాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు.బియ్యంతో చేసిన తియ్యటి పదార్థాలు, కూరగాయలు,ఖీర్ కాళికా పూజలో ఆ తల్లి ముందు పెడతారు.ఏ వంటకాలైన సరే వరిధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు.
హనుమంతుడు: హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు.ఎర్రటి కందిబెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మనకు కోరికలను తీరుస్తాడట. అందుకే అప్పాలను స్వామి వారికి నైవేద్యంగా వినియోగిస్తారు.
శ్రీకృష్ణుడు: శ్రీకృష్ణుడుకి బాల్యంలోనే వెన్నదొంగగా పేరుంది.వెన్న అంటే అంత ఇష్టం.పక్క ఇళ్ళలో ఉన్న వెన్నను దొంగిలించి మరీ తినేవాడట.అందులో తెల్లటి వెన్నంటే ఆయనకు మహా ప్రీతి.అందులో చక్కర కలుపుకొని ఆరగించేవాడట.ఇంకా కొబ్బరితో చేసిన లడ్డూలన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట.ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే ఆయన ముందు ఉంచుతారు భక్తులు.
శనిదేవుడు:శనిదేవుడికి నలుపు వర్ణం అంటే ఇష్టం.నల్లని నువ్వులతో చేసిన వంటకాలను శనిదేవుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు.అలాగే ఆవాల నూనెతో చేసిన వంటకాలను శనిదేవుడి పూజలో ఉపయోగిస్తారు.
ఏ ప్రసాదం నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితం....
- కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల పనులు సులభంగా కావడానికి. అనుకున్న రీతిలో సాఫీగా పనులు సాగిపోవడానికి, కార్యాలయాలలో పై అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉండటానికి కొబ్బరిక నైవేద్యం పెట్టాలి.మొదలు పెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు.
- కార్యసిద్ధి కోసం..చాలామంది భగవంతుని పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అరటి పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు. పెండిగ్ ఉన్న పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.
- నిలిచిపోయిన పనులు పునః ప్రారంభం కావాలని కోరుకుంటూ దేవుడికి నారింజ పండ్లు పెడతారు.
- అరటి పండు గుజ్జుగా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. పెండ్లి తదితర శుభ కార్యాలయాలకు సకాలంలో నగదు అందుతుంది. నగదు మంజూరవుతుంది. నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుంది.
- యాపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే సకల దరిద్రాలు తొలగిపోతాయని అంటారు. మామిడి పండు దేవుడికి ప్రసాదంగా పెడితే సంపద పెరిగే అవకాశం ఉంటుంది.
- వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్నా, పెళ్లి అనుకుంటే ఏదైనా అశుభం జరిగినా కూడా ఈ పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టి చూడండి. సపోటా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహం సకాలంలో జరుగుతుంది విశ్వసిస్తారు.
- ఆరోగ్యం కోసం...శని దేవుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మకం.
- అనారోగ్యంతో సతమవుతూ ఉంటే దేవుడికి అంజీర్ పండ్లు నైవేద్యంగా పెట్టాలి.
- ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆనందం, సంతోషం కలిగిస్తుంది.. ఐశ్వర్యం సిద్ధిస్తుంది.ద్రాక్షపండ్లు దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి.
- శత్రువులు, పగవారి మీద విజయం కోసం భగవంతుడికి పనస పండు నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు.
- ఇష్ట దైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది.