వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు మంత్రి కొడాలి నాని. పేకాట క్లబ్బులపై తనను టార్గెట్ గా చేసుకుని TDP నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో పేకాట క్లబ్బులపై దాడిజరిగిన తర్వాత నాని…సీఎం జగన్ తో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో
పేకాట క్లబ్బులో మీ ప్రధాన అనుచరులు ఉన్నారట కదా అని ప్రశ్నించగా.. ఒకరిద్దరు ఉంటారు. ఉంటే ఏమవుతుంది.. పేకాట ఆడితే ఉరి శిక్ష వేస్తారా..వారిపై కేసు పెట్టి కోర్టుకు తీస్కెళ్తారని అన్నారు కొడాలి నాని. ఫైన్ కట్టి వచ్చేస్తారు. ఏ శిక్ష వేస్తారు.. పట్టుకుంటే ఫైన్ కడతారు. మళ్లీ వెళతారని చెప్పారు. అందుకే కదా విచ్చలవిడిగా ఆడేది. భయపడంది అందుకే కదా. దీన్ని అరికట్టేందుకే వైఎస్ జగన్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారని తెలిపారు. అయినా పేకాట క్లబ్బులు ఒక సారి మూసివేస్తే ఆగిపోతుందా… ఇదంతా రొటీన్ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.
తాను సీఎం ను కలిసింది రోడ్డు పనుల కోసమని తెలిపారు కొడాలి. సీఎంను కలిసింది ప్రజల కోసమేనన్నారు. గుడివాడ ప్రజలు నాలుగు సార్లు గెలిపించారు. వారి పనుల కోసమే వెళతానన్నారు.
