నిజాం షుగర్స్‌‌‌‌ ఎప్పుడు తెరుస్తరు ?

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

మెదక్​, వెలుగు : మెదక్‌‌‌‌ మండలం మంబోజిపల్లిలో ఉన్న నిజాం షుగర్‌‌‌‌ ఫ్యాక్టరీని ఎప్పుడు ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మెదక్‌‌‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బోధన్‌‌‌‌, మెట్‌‌‌‌పల్లి, మెదక్‌‌‌‌ ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ను తెరుస్తానని ఎన్నికలకు ముందు రేవంత్‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఎన్ని వందల కోట్లు అయినా ఖర్చు చేసి చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి, ఇప్పటివరకు కనీసం రివ్యూ చేయకపోవడం దారుణం అన్నారు. 

18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధును ఎగ్గొట్టిందన్నారు. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటివరకు రేషన్‌‌‌‌ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి రేషన్‌‌‌‌ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సమావేశంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌‌‌‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌ వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌గౌడ్‌‌‌‌, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, ఆంజనేయులు, శ్రీనివాస్, కిశోర్‌‌‌‌ పాల్గొన్నారు. అంతకుముందు మెదక్‌‌‌‌ చర్చిలో ప్రార్థనలు చేశారు.