Good Health : వర్కవుట్స్ చేసే ముందు అరటి పండు లేదా ఖర్జూరాలు తినాలా.. ?

చాలామంది వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎలా పడితే అలా చేస్తే సరైన ఫలితాలు ఇవ్వవు. కాబట్టి కొన్ని అంశాలు పాటించాలి. ఆరోగ్యానికి ఎక్సర్ సైజ్ మంచిదే అయినా, ఆహరం కూడా వ్యాయామంపై ప్రభావం చూపుతుంది. బరువు నియంత్రణలో ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి.  

ఎక్సర్ సైజ్ కు ముందు, తరువాత తీసుకునే ఆహారం సరైనది కాకపోతే మెరుగైన ఫలితం ఉండదు. కాబట్టి వ్యాయామానికి కొద్ది నిమిషాల ముందు ఒక అరటి పండు, లేదంటే రెండు ఖర్జూరాలు తీసుకోవాలి. దీని వల్ల సరిపడా శక్తి వస్తుంది. అలసట కూడా ఉండదు. 

వ్యాయామం మధ్యలో కొద్దిగా నీళ్లు తాగాలి. దీని వల్ల త్వరగా అలసిపోరు. వ్యాయామం తర్వాత అరటిపండు, బాదాం, పండ్లు, పెరుగు తీసుకోవచ్చు. ఇలా చేస్తే శరీరం త్వరగా కోలుకుంటుంది. అంతేకాదు బరువును కంట్రోల్ చేయొచ్చు.

ALSO READ | Good Health : బీట్ రూట్ తినండి.. బీపీ కంట్రోల్.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. ఇంకా ఎన్నో..!