వాట్సాప్ గ్రూప్ చాట్స్‌లో ఎవరు, ఎప్పుడు మెసేజ్ చేశారో చూడటం ఇప్పుడిక ఈజీ. అందుకు వాట్సాప్ ‘సెర్చ్ బై డేట్’ అనే ఆప్షన్ తెచ్చింది. ఐఓఎస్, మ్యాక్ డెస్క్‌టాప్, వాట్సాప్ వెబ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది ఈ ఫీచర్. ఇది మీరు వెతకాలనుకున్న డేట్‌తో మెసేజ్, ఫొటో, వీడియోలను వెతికేందుకు ఉపయోగపడుతుంది. తేదీల వారీగా సెర్చ్ చేయడం వల్ల చాట్ నావిగేట్ చేయడం ఈజీ అవుతుంది.
సెర్చ్ బై డేట్
గ్రూప్ చాట్ ఓపెన్ చేసి డేట్ ప్రకారం సెర్చ్ చేయడానికి సెర్చ్ సింబల్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ‘క్యాలెండర్’ ఆప్షన్ని సెలక్ట్ చేయాలి. తరువాత క్యాలెండర్ గుర్తును ట్యాప్ చేసి ఏ తారీఖు మెసేజ్‌లు చూడాలనుకుంటే ఆ డేట్ ఎంచుకోవాలి.
ఫొటో సెర్చ్ కోసం
గ్రూప్‌లో కుడివైపు పైనున్న మూడు చుక్కల్ని ట్యాప్ చేస్తే ‘గ్రూప్ మీడియా’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేస్తే మీడియా, లింక్స్, డాక్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, లింక్స్ కనిపిస్తాయి.
మాటిమాటికి లాక్ తీయక్కర్లే!
గూగుల్ మ్యాప్స్ వాడేటప్పుడు స్క్రీన్ లాక్ అవడం అనేది అందరికీ ఎదురయ్యే ప్రాబ్లమే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ తెచ్చింది.
గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేస్తే టైంతోపాటు షార్ట్ కట్ రూట్స్ కూడా కనిపిస్తాయి. మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ లాక్ అయితే అన్‌లాక్ చేసి వివరాలు చూడాలి. కానీ, కొత్త ఫీచర్‌తో మొబైల్ స్క్రీన్ లాక్ అయినా, లాక్ స్క్రీన్‌పై వివరాలు కనపడతాయి. దీంతో మ్యాప్స్ వాడేటప్పుడు మాటిమాటికి ఫోన్ లాక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకోవాలంటే...
మ్యాప్స్‌లో గ్లాన్సబుల్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి.
- గూగుల్ మ్యాప్స్ పైన కుడివైపు కనిపించే ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి.
- సెట్టింగ్స్‌లో నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
- అందులో కిందికి స్క్రోల్ చేస్తే ‘గ్లాన్సబుల్ డైరెక్షన్ వైల్ నావిగేటింగ్’ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి.