వాట్సాప్ నుంచి ప్రీమియం పెయిడ్ సర్వీసులు !

వాట్సాప్ నుంచి ప్రీమియం పెయిడ్ సర్వీసులు !

వాట్సాప్ కూడా ప్రీమియం అకౌంట్  సర్వీసెస్ ను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ప్రీమియం సర్వీస్ ను సబ్ స్క్రయిబ్ చేసుకునే వాళ్లకు ప్రీమియం మెనూ ఓపెన్ అవుతుంది. దానిలోకి వెళ్లి అదనపు ఫీచర్లను ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.

తొలి విడతలో వాట్సాప్ ప్రీమియం సర్వీసులను కేవలం వ్యాపార వర్గాల కోసం మాత్రమే అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక యూజర్ నేమ్ తో వాట్సాప్ కాంటాక్ట్ లింక్ ను క్రియేట్ చేసుకొని అందరికీ షేర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కాంటాక్ట్ లింక్ ను క్రియేట్ చేశాక.. ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ తరహా ఫీచర్ టెలిగ్రామ్ యాప్ లో అందుబాటులో ఉంది.

వాట్సాప్ పెయిడ్ వర్షన్ ను సబ్ స్క్రయిబ్ చేసుకునే వాళ్లు ఏకకాలంలో 10 వేర్వేరు డివైజ్ లలో లాగిన్ కావచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బిజినెస్ అకౌంట్లను వారి ఉద్యోగులు మేనేజ్ చేసేందుకు ఈ ఫీచర్ ఎంతో దోహదపడుతుంది. దీంతోపాటు 32 మందితో ఏకకాలంలో వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు. వాట్సాప్ ప్రీమియం సర్వీసుల సబ్ స్క్రిప్షన్ చార్జీలు ఎంత ? ప్లాన్ల వ్యాలిడిటీ ఎంత కాలం ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.