వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లని తీసుకొచ్చే వాట్సాప్, ఇప్పుడు ఫార్వర్డ్ మెసేజ్ టెక్స్ట్ ఫీచర్‌ని తీసుకొచ్చింది. అంటే గతంలో ఏదైనా మెసేజ్, ఫొటో, వీడియోలని ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆ మెసేజ్ కింద టెక్స్ట్ యాడ్ చేసే ఫెసిలిటీ ఉండేది కాదు. అయితే ఇప్పుడు తెచ్చిన కొత్త అప్‌డేట్‌తో ఫార్వర్డ్ మెసేజెస్‌కి టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఐఓఎస్‌లో అందుబాటులోకి వస్తుంది.
మరొక అప్‌డేట్... చాట్‌ని తేదీల వారిగా వెతుక్కునేలా క్యాలెండర్ సెర్చ్ ఫీచర్‌ని తీసుకొస్తోంది. అంటే ఇదివరకు చేసిన మెసేజెస్ క్యాలెండర్ సాయంతో వెతుక్కోవచ్చు. దీనికోసం మెసేజ్ టైంపింగ్ బార్ దగ్గర క్యాలెండర్‌ని యాడ్ చేయబోతున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెక్స్టింగ్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లోకి తీసుకురానున్నారు.
ట్యాబ్లెట్ టు మొబైల్ కనెక్ట్ ఫీచర్ కూడా రాబోతోంది. అంటే లాగౌట్ చేయకుండా ఒకే వాట్సాప్‌ని మొబైల్, ట్యాబ్లెట్‌ల్లో వాడుకునే ఫీచర్ తీసుకొస్తుంది వాట్సాప్.
