వాట్సాప్ 71 లక్షల అకౌంట్లను తొలగించింది..ఎందుకంటే.. 

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్..యూజర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో దాదాపు 71 లక్షల ఇండియాన్ యూజర్ల అకౌంట్లను నిషేదించింది. మేసేజింట్ ఫ్లాట్ ఫాం ఐటీ రూల్స్, 2021 ప్రకారం యూజర్లనుంచి వచ్చిన కంప్లైంట్స్ పై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతి నెలా ఐటీ రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లపై తీసుకున్న చర్యలు వెల్లడిస్తుంది. గడిచిన ఏప్రిల్  నెలలో ఐటీ రూల్స్ ఉల్లంఘించిన 71 లక్షల ఇండియన్ యూజర్ల అకౌంట్లపై నిషేధం విధించింది. 

వాట్సాప్ తాజా నివేదికలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు వినియోగదారులనుంచి అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంది. కంపెనీ నిషేధ అప్పీళ్లు, భద్రత, అకౌంట్ యాక్సెస్ లకు సంబంధించిన 10వేల 554 ఫిర్యాదులు అందుకుంది. 

భారతదేశంలో మొత్తం 7,182,000 అకౌంట్నిలు షేధించబడ్డాయి. వీటిలో 13 లక్షల 2వేల ఖాతాలు వినియోగదారులనుంచి రిపోర్టు లేకుండానే ముందస్తుగా నిషేదిం చబడ్డాయి.ఆన్ లైన్ ఫ్రాడ్ అరికటేందుకు  వాట్సాప్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఎనలిస్టులు, రీసెర్చర్లు, యాక్టు ఇంప్లిమెంట్, ఆన్ లైన్ సెక్యూరిటీ, టెక్నాలజీ డెవలప్ మెంట్ కలిగి ఉంది.ఇది నిరంతరం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్స్ మేసేజింగ్ సర్వీస్ లను అందిస్తుందని కంపెనీ తెలిపింది.