Dasara 2024: ఉపవాసం ఉంటున్నారా.. ఏంతినాలి.. ఏం తినకూదు.. !

దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  అమ్మవారిని ఎంతో భక్తితో పూజిస్తారు. చాలా మంది దసరా పండుగ తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేస్తారు. అయితే ఉపవాసం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి.  లేకపోతే ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందిపడతారు.  నవరాత్రి ఉపవాసం సమయంలో ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసుకుందాం. . .

దసరా పండుగ తొమ్మిది రోజులు చాలా మంది  ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో అన్ని రకాల పండ్లు , పచ్చి కూరగాయలు తినవచ్చు.  పాలు, పనీర్​ డ్రైఫ్రూట్స్​ కూడా తినవచ్చు. ఈ తొమ్మొది రోజులు బియ్యం, గోధుమలతో తయారు చేసిన  పదార్ధాలను తినరు.  కాని ఆరోగ్యంగా ఉండేందుకు చిరుధాన్యాలను పిండిగాచేసుకుని తింటుంటారు.. దీనినే బామ్మలు.. అమ్మమ్మలు చప్పిడి పిండి అంటుంటారు. 

  • ఉపవాసపమయంలో పండ్లు తినాలి. తాజా పండ్లు తినడం వల్ల  ఆరోగ్యమేకాదు.. ఎనర్జిటిక్​ గా కూడా ఉంటారు.. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.  
  • అరటి పండ్లు, బొప్పాయి,  ద్రాక్ష, యాపిల్, దానిమ్మ,  వంటివి తినాలి. 
  • నవరాత్రి వ్రతంలో పాలు  తాగండి.  పాలతో తయారు చేసిన పదార్ధాలు పెరుగు ,  జున్ను తినడం వలన నీరసం రాదు.  శరీరానికి కావలసిన ప్రోటీన్స్​ ను అందిస్తాయి. 
  •  ఉడికించిన పదార్దాలు తినాలనుకుంటే  ఉపవాస సమయంలో మీరు రాతి ఉప్పును తినవచ్చు.
  • ప్రతి 2 నుంచి మూడు గంటలకు ఏదో ఒకటి తినాలి.  అంటే ఆకలి లేకుండా ఉండాలి.
  • ఉపవాస సమయంలో శరీరం డీ హైడ్రేడ్​ కాకుండా... తగినంత నీరు తాగాలి
  • డ్రైఫ్రూట్స్​ లో అధికంగా పోషకాలు ఉంటాయి.  ఫాస్టింగ్​ సమయంలో ఇవి తింటే ఆరోగ్యంతో పాటు శక్తి కూడా లభిస్తుంది.