Good Health : ఎండాకాలం ఇవి తింటే కడుపు ఉబ్బరం, తిన్నది అరగదు

ఎండాకాలం వచ్చేసింది.. అలా కాస్త బయటకు వెళితే.. ఏ వయస్సు వారికి అయిన నీరసం అవుతుంది.. అయితే నీరసం అవుతుందని కొంతమంది ఏది పడితే అది తింటుంటారు.. వేసవిలో కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా తక్కువగా తినాలి. ఆహార పదార్థాలు నోరూరించినా వీలైనంత వరకూ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం లాంటి సమస్యలు ఎదురవుతాయి. 

* ఎండలు పెరిగే కొద్ది రోజూ తీసుకునే ఆహారంలో కారం, మసాలాలు చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి, జీవక్రియలను మందగించేలా చేస్తాయి. 
* అలాగే చికెన్, మటన్.. లాంటివి తింటే ఈ కాలంలో జీర్ణసంబంధ సమస్యల్ని పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి.
* వేసవిలో ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకున్నా.. కాఫీ, టీలు తగ్గించాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని నీటిశాతం తగ్గి.. డీహైడ్రేట్ అవ్వొచ్చు. శరీరం కూడా తేమ కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.
* ఈ కాలంలో వేపుళ్లు, ఫ్రెంచ్ ప్రైస్, చిప్స్.. లాంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి అసలు వెళ్లకూడదు. లేదంటే
వికారం, అతిగా దాహం వేయడం తప్పదు.

ALSO READ :- Indian Snacks : సాయంత్రం పూట పిల్లలకు క్రిస్పీగా.. ఇంట్లోనే పొటాటో ఫ్రై ఇలా చేయొచ్చు..!