Children Food: పిల్లలకు ఈ ఫుడ్ పెడితే చాలా మంచిదట.. బ్రెయిన్​ రాకెట్ లా దూసుకుపోతుందట..

Childrens Food: ఎదుగుతున్న పిల్లల అహారం విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించటం మంచిది. ఎందుకంటే తీసుకునే ఆహారం వారి ఎదుగుదలలో ఎంతగానో సహాయపడుతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలోనే కాకుండా వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరేందుకు అవకాశం ఉండదు. తద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  ఎదుగుతున్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. . . .

నేటి బాలలే రేపటి భారత పౌరులు. సహజంగా పిలలు చురుగా, ఆరోగ్యంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. అయితే పిల్లలో బ్రెయిన్ ఎదుగుదలకు, వారి ఫోకస్ పెరిగేందుకు కొన్ని రకాల ఆహారం అవసరం. ఆ ఆహారాన్ని అందించే విషయంలో తల్లి, తండ్రులే వారికి సహాయపడాలి. పిల్లలకు తినడం ఎలా అలవాటు చేస్తే... అలాగే అలవాటు చేసుకుంటారు.  టైంకి తినేలాగా.. అది కూడా మంచి ఫుడ్ తినేలా అలవాటు చేయడాన్ని తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలి. ఇది తిను, అది తిను  అని పిల్లలను ఒత్తిడి చేయటం, తినేటప్పుడు మధ్యలో వెళ్లి..  ఫాస్ట్ గా తిని చదువుకో .. అంటూ మందలించటం లాంటివి చేయొద్దు. తినేటప్పుడు పిల్లలెప్పుడూ సంతోషంగా ఉండేలా చూడాలి. చిన్నారులు కొన్ని పదార్థాలు తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు కచ్చితంగా తినాల్సిందేనంటూ పెద్దలు బలవంతం చేయకూడదు. పిల్లలు తినే పదార్థాలను అలంకరించి ఇస్తే ఇంకా ఇష్టంగా తింటారు. 

ఏదో ఒక పూట పిల్లలు తిండి తినకపోతే బలవంతం చేయొద్దు, వాళ్లకు బాగా ఆకలి వేసినప్పుడే తింటారని గుర్తుంచుకోవాలి. తినడానికి ముందు చేతులు కడగటం, తిన్న తర్వాత విధిగా బ్రష్ చేయించడం మర్చిపోవద్దు. రోజూ ఉదయం లేవగానే ముఖం కడిగిన తర్వాత రెండు మూడు గ్లాసుల నీళ్లు తాగించడం అలవాటు చెయ్యాలి. దంపుడు బియ్యం, గోధుమ అన్నం తినేలా తయారు చేయాలి, తాజాకూరలను వండి పెట్టడంతో పాటు.. పచ్చికూరగాయలను తినమని పిల్లలకు చెప్పాలి. లంచ్ బాక్స్ లో చపాతీ, ఇడ్లీలు, మొలకెత్తిన విత్తనాలు, బ్రౌన్ బ్రెడ్ స్లైసుల్లాంటివి పెట్టిస్తే మంచిది. జంక్​ ఫుడ్​ కు  దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి ఆహారం పెడితే పిల్లలకు మెదడు చురుకుగా పనిచేసి .. ఙ్ఞాపకశక్తి వృద్ది చెందుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

పిల్లలకు రోజులో 4 నుంచి 5సార్లు భోజనం తినిపించాలి. ఇందులో ఎక్కువ కూరగాయలు, పండ్లు, పాలు ఉండేలా చేస్తే ఇంకా మంచిది. పిల్లల్లో చిన్న వయసులోనే ఊబకాయం రాకూడదంటే ఆహారంలో గోధుమ, బియ్యం, ఓట్స్, కార్న్‌మీల్, బార్లీలాంటివి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇవేకాకుండా బ్రౌన్ రైస్, ఓట్‌మీల్స్ లాంటివి పిల్లల ఎదుగుదలకు మరింత ఉపయోగపడుతాయి. పాల ఉత్పత్తులను కూడా పిల్లలకు అలవాటు చేయాలి. అయితే ఇందులో ఫ్యాట్ ఫ్రీ ఉన్నవాటిని ఎంచుకోవాలి. వీటివల్ల వారికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది. అలాగే పిల్లలకు ప్రొటీన్ ఆహారం తప్పకుండా ఇవ్వాలి. దానికోసం చేపలు, నట్స్, లాంటివి పెట్టొచ్చు. అలాగే మాంసం విషయంలో తక్కువ కొవ్వు ఉండే మాంసాన్ని అలవాటు చేస్తే మంచిది.

మామూలుగా మనం అల్పాహారం, భోజనంలో కూరగాయలు, పండ్లు వగైరా వాటిని ఉపయోగిస్తుంటాం. స్నాక్స్ టైమ్‌లో మాత్రం బయట దొరికే ఆయిల్ ఫుడ్ లేదా చిప్స్ వంటివి తీసుకుంటూ ఉండటం వల్ల ఎటువంటి ఆరోగ్యం మనకి ఉండదు. అలాగే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు హోం వర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తాను వంటివి చెబుతూ ఉంటారు ఇటువంటి పిల్లలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని మీరు వీలైనంత వరకూ తగ్గించడం మంచిది. మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేయడం.. ఎక్కువగా కూరగాయలు వేసి శాండ్విచ్ చేయడం లాంటివి మీరే చేయండి. దీని వల్ల మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళ తీసుకోగలరు. మిగిలిపోయిన వెజిటెబుల్స్ నుండి ర్యాప్ లాంటివి చేసి పెట్టండి. కూరగాయలు పండ్లు ఎక్కువగా వాళ్లకి పెడుతూ ఉండండి దీని వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పైగా భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది. కనుక వీలైనంత వరకు బయట ఫుడ్ ని తీసుకోకుండా ఉండేలా చేయండి ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయల ముక్కలు తో సలాడ్స్ వంటివి చేయండి.