సనాతన హిందూ మతం ప్రకారం.. స్నానానికి గొప్ప స్థానం ఉంది. అందులోనూ సముద్ర స్నానానికి, పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానానికి కూడా ప్రత్యేక రోజులు ఉన్నాయి. కార్తీక మాసంలో చేసే ...కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం.
కార్తీక మాసంలో ఒక నెల పాటు తీర్థ స్నానం చేయడం వలన ఆధ్యాత్మికత పరంగా చాలా శుభపరిణామాలు ఉన్నాయని పండితులు చెబుతున్నాయి. కార్తీక మాసంలో, సూర్యోదయానికి ముందు రెండు ఘాటీలు అంటే ఒక సుమారు ఒక గంట ముందు చేసే తీర్థస్నానాన్ని కార్తీక స్నానం అంటారు.
పుణ్యక్షేత్రాలకు వెళ్లడం కుదరని పక్షంలో .... పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నీటితో స్నానం చేయవచ్చు. అయితే దీనికి ముందు ఒక మంత్ర పఠించాల్సి ఉంటుంది.
‘మహావిష్ణోః అనుగ్రహ ప్రాప్త్యర్థం తీర్థ స్నానం కరిష్యే’ అని జపించి స్నానం చేసిన తరువాత ....
పవిత్ర కార్తీక ప్రాతఃస్నానం కరిష్యే. అని చెప్పి నీళ్ళు వదలాలి.
కార్తీకస్నానం
ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం కార్తీకమాసానికి ఉంది. తెల్లవారు ఝామున చన్నీటి స్నానం. దీనివెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. కార్తీకమాసంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే- అది రకరకాల శబ్దాలు చేస్తూ, సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్లిపోయే నది నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది.
వర్ష రుతుప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం కార్తీకమాసం. ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారమే కార్తీకస్నానం.
also read :- అయ్యప్ప దీక్ష: ఓ పక్క ఆధ్యాత్మికం.. మరో పక్క ఆరోగ్యం..
నదుల్లో, సరస్సులు, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇది వీలుకాకపోతే ఇంట్లోనైనా శాస్త్ర ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసంలో ఈ విధంగా స్నానం చేస్తే సర్వపాపాలు నశించి, శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి.
నిత్యే నైమిత్తికే కృష్ణకార్తికే పాపనాశ అనే మంత్రం శాస్త్రాలలో ఉంది. నిత్యం స్నానం చేస్తే బాహ్యంగా శుద్దవుతుంది. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల అంతర్గతంగా శుద్ది జరిగి పాపాలు కూడా నశిస్తాయి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నుదుటిపై తిలకం పెట్టుకోవాలి.
కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యడమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఒక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. కార్తీక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే, ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కన ఉండే నదేనని గ్రహించాలి.
నదీ స్నానం నిబంధనలు
నదీ స్నానం చేయటానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చెయ్యకూడదు. “నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను, ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేనివాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి? ” అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే -“గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్య దేశస్థే ” అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి.
నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తుంది. అయితే స్నానం చేసి వెళ్లిపోతే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చెయ్యాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి. ఈ జగత్తును రక్షించే అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది.
చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో, కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపంలో అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో కుక్కలు లేత పచ్చిగడ్డిని కొరుక్కుతింటాయి. దీని వల్ల వాటి కడుపులో అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు బయటకు వచ్చేస్తాయి.
శాస్త్ర ప్రకారం పురుషుడు నదీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. స్త్రీలు వాలుకి చేయాలి. అభిముఖంగా స్నానం చేస్తే పాములు కొట్టుకు వచ్చి కాటు వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పురుషులను శ్రావణ మాసంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోను నదీ స్నానం చేయవద్దని పండితులు చెబుతున్నారు.