IND vs AUS: టీమిండియా గెలిచేనా..! MCGలో మునపటి ఛేజింగ్ రికార్డులేంటి..?

భారత్- ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‎లో తేలిపోయిన భారత బౌలర్లు.. సెకండ్ ఇన్నింగ్స్‎లో పర్వాలేదనిపిస్తున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజులో నాథన్‌ లైయన్ (41*), స్కాట్ బోలాండ్ (10*) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 333 పరుగుల లీడ్‌లో ఉంది. 

ఆఖరి రోజు.. 98 ఓవర్లు..!

ఈ టెస్టులో మిగిలివుంది ఆఖరి రోజు మాత్రమే. ఆసీస్ ఇన్నింగ్స్‌ను మరో 20 పరుగులలోపు ముగించినా.. భారత లక్ష్యం 350 పరుగుల వరకూ అంచనా వేయవచ్చు. చివరి రోజు అంత పెద్ద లక్ష్యాన్ని చేధించడమంటే కష్టంతో కూడుకున్నదే. అయితే, డబ్ల్యుటిసి ఫైనల్‌కు అర్హత సాధించాలనే ఆశను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ గెలవక తప్పదు. ఆస్ట్రేలియా ఏ లక్ష్యాన్ని నిర్దేశించినా.. చేధించే ప్రయత్నమే చేయాలి. ఈ క్రమంలో MCGలో టెస్టుల్లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు ఏవనేది చూద్దాం..

Also Read : వికెట్ పడకుండా రోజంతా ఇద్దరే బ్యాటింగ్

96 ఏళ్ల క్రితం అత్యధిక ఛేజింగ్

మెల్‌బోర్న్ గ్రౌండ్‪లో టెస్టుల్లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్..332. అదీ 96 సంవత్సరాల క్రితం. ఇక 20వ శతాబ్దంలో ఈ వేదికపై అత్యధిక విజయవంతమైన ఛేజింగ్.. 231 పరుగులు. 2013/14 హోమ్ యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య ఆస్ట్రేలియా చేధించింది. 

MCGలో టెస్టుల్లో అత్యధిక ఛేజింగ్‌లు

  • 332: ఇంగ్లాండ్ (ఆస్ట్రేలియాపై, 1928లో) మూడు వికెట్ల తేడాతో విజయం.
  • 297: ఇంగ్లాండ్ (ఆస్ట్రేలియాపై, 1895లో) ఆరు వికెట్ల తేడాతో గెలుపు.
  • 295: దక్షిణాఫ్రికా (ఆస్ట్రేలియాపై, 1953లో) ఆరు వికెట్ల తేడాతో విజయం. 
  • 286: ఆస్ట్రేలియా (ఇంగ్లాండ్ పై, 1929లో) ఐదు వికెట్ల తేడాతో గెలుపు.
  • 282: ఇంగ్లాండ్ (ఆస్ట్రేలియాపై, 1908లో) వికెట్ తేడాతో విజయం.