మన్ కీ బాత్: అరకు కాఫీ ప్రస్తావన తెచ్చిన మోడీ.. ఆ కాఫీ స్పెషాలిటీ ఏంటి..

మన్ కీ బాత్ మళ్ళీ ప్రారంభమయ్యింది.ప్రధాని మోడీతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ఈ రేడియో కార్యక్రమం 2024 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సమయంలో నిలిచిపోయింది.కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మన్ కి బాత్ పునః ప్రారంభం అయ్యింది. జూన్ 30 2024 ( ఆదివారం ) నాడు ప్రసారమైన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ అరకు కాఫీ గురించి ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది.

2016లో మోడీ విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, అప్పటి గవర్నర్ నరసింహన్ తో కలిసి అరకు కాఫీని టేస్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ప్రధాని.ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గత సంవత్సరం సెప్టెంబర్ లో ఢిల్లీ వేదికగా జరిగిన G 20సమ్మిట్ లో కూడా అరకు కాఫీ ఏర్పాటు చేసిన సందర్భాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. మన్ కి బాత్ లో అరకు కాఫీ గురించి ప్రస్తావించిన అంశాన్ని ప్రధాని ట్విట్టర్లో షేర్ చేయగా సీఎం చంద్రబాబు మోడీకి కృతఙ్ఞతలు చెప్తూ రిప్లై ఇవ్వటం విశేషం.

అరకు కాఫీ స్పెషాలిటీ ఏంటి :

అరకు వ్యాలీలో సాగు అవ్వటం వల్ల ఈ కాఫీకి అరకు కాఫీ అని పేరు వచ్చింది. అరకు ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు కాఫీ సాగుకు అనుకూలిస్తాయి. అరకు వ్యాలీలోని మట్టిలో ఐరన్ పుష్కలంగా ఉండటం అక్కడి వేడి వాతావరణం వల్ల కాఫీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది.ఇదే అరకు కాఫీకి ప్రత్యేకత తెచ్చి పెడుతుంది.