ఆధ్యాత్మికం: శాస్త్రాలు అంటే ఏమిటి.. వాటినే ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి

మానవులు.. ఏది చేయాలి.. ఏది చేయకూడదు... సమాజంలో ఎలా ఉండాలి.. ఎవరితో ఎలా ఉండాలి.. అనే విషయాలు శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. సృష్టి స్థాపన కోసం.. బ్రహ్మకు... పరమాత్మ వేదాలను ప్రసాదించాడు. వీటినే పురాణ ఇతిహాసాలుగా శాస్త్రాలుగా పరిగణిస్తారు. ఇలాంటి శాస్త్రాలు అనేకం ఉన్నాయి.  మనుషుల కర్తవ్యాల విషయంలో సందేహాలు కలిగినప్పుడు ఇలాంటి శాస్త్రాలను ప్రామాణికంగా తీసుకుంటారు.  కొన్ని పరస్పర విరుద్ధంగా కనబడినా, సందర్భానుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా అవే శాస్త్రాలలో కొన్ని చోట్ల సంఘటనా రూపంగానో, ఉపదేశరూపంగానో చెప్పబడి ఉంటాయి. వ్యక్తి, చుట్టూ ఉన్న పరిసరాలు, అనంత విశ్వం - ఈ మూడింటినీ సమన్వయించుతూ ఆ మహర్షులు కేవలం మన క్షేమం కోసమే చెప్పినవి శాస్త్రాలు. 

 శ్రీకృష్ణపరమాత్మ వచనం..  ప్రకారం  వేదవిజ్ఞానాన్ని అనుసరించి విధాత విశ్వనిర్మాణాన్ని సాగించాడు. అంటే విశ్వనిర్మాణ సూత్రాలు వేదాలలో దాగి ఉన్నాయి .  ఆ వేదధర్మాలను మహర్షులు స్మరిస్తూ అందించినవే స్మృతులు. ఇవి ధర్మశాస్త్రాలు,శ్రుతుల అర్థాలను విస్తృతంగా వ్యవహారంలో వినియోగించేందుకు విధానాలను పురాణేతిహాసాలు ఆచరణాత్మకంగా అందించాయి. భారతీయ వ్యవస్థ అంతా వీటిని ప్రాతిపదికగా తీసుకొని పటిష్టమయ్యింది.

Also Read:- పిస్తాలు తినండి.. చాలా రోగాలు మాయం

శాస్త్రాల్లో ప్రతి విషయాన్ని  ఎంతో అర్ధవంతంగా వివరించారు.  ప్రతి జీవరాశికి సంబంధించిన సుఖ భోగాలు.. ఆ జీవునికి కావలసిన శాశ్వత సుస్థితి..మంచి.. చెడులు  మొదలైన విషయాలన్నీ శాస్త్రాల్లో పేర్కొన్నారు. మహర్షులు తపశ్శక్తితో అతీంద్రియ దృష్టిని ... విశ్వ హితాన్నా ఆకాంక్షిస్తూ శాస్త్రాలను రాశారు.  వీటి ద్వారానే  జ్ఞానం సంపాదించుకోవడానికి కావలసిన సాధన..అవగాహన మొదలైనవి ఏర్పడుతాయి.  అందుకే  బ్రహ్మసూత్రాలు  కూడా శాస్త్రయోనిత్వాత్ అన్నారు రుషులు.  

 ప్రత్యక్ష, అనుమానాది ప్రమాణాల కన్నా శాస్త్ర ప్రమాణానికే ప్రాధాన్యమిచ్చారు మనవారు. తమకంటూ ఏ స్వార్థమూ లేక కేవలం లోకహితైషులైనవారు ఋషులు. మనుషులు  స్వార్థానికి పోయినప్పుడు   పరమితదృష్టికి ఆటంకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు  కొన్ని శాస్త్రవిషయాలు గోచరించినా, పరిణామంలో శాశ్వతమైన క్షేమాన్ని, వ్యవస్థకు ధర్మబలాన్ని సమకూర్చడంలో అవి సఫలీకృతమవుతాయి.  మనుషులు తీసుకునే  నిర్ణయాలు అనేక మానసిక వికారాలతో కూడుకొని ఉంటాయి. నియమబద్ధమైన జీవనసరళి, లోతైన అధ్యయనం వంటివి లేక, మానసికోద్రేకాలను సవరించుకోలేని మానవులు, తమకు తోచినట్లుగా ప్రవర్తిస్తూ పోతే శాశ్వత క్షేమానికే భంగం కలిగే ప్రమాదముంది. అది సామాజిక భద్రతని దెబ్బతీసి, విచ్చలవిడితనానికి దారితీస్తాయి.  అందుకే నిత్యభద్రత కోసం మనిషి స్వార్థాన్ని నియంత్రించే విషయమై, సూక్ష్మతమమైన రహస్యవిజ్ఞానంతో శాస్త్రాలు ఏర్పడ్డాయి. శాస్త్రాలను ప్రమాణాలుగా గ్రహించి జీవితాన్ని మలచుకోవాలని పరమాత్మ గీత ద్వారా నిర్దేశించాడు. ప్రస్తుతం హైటెక్ యుగంలో కొంతమంది  అహంకారంతో, వితండవాదంతో.. ఒకరిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించే వారు శాస్త్రాలను తారుమారు చేసి విధి పూర్వకంగా ప్రవర్తించే వారికి గతులుండవని శ్రీకృష్ణపరమాత్మ గీతాశాస్త్రంలో హెచ్చరించాడు.