ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ ఐదో టీ20 రద్దు

గ్రాస్‌‌‌‌‌‌‌‌ ఐలెట్‌‌‌‌‌‌‌‌ (సెయింట్‌‌‌‌‌‌‌‌ లూసియా): భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ మధ్య ఆదివారం జరిగిన ఐదో టీ20 రద్దయ్యింది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 3–1తో సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన విండీస్‌‌‌‌‌‌‌‌ 5 ఓవర్లలో 44/0 స్కోరు చేసింది. ఎవిన్‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌ (29 నాటౌట్‌‌‌‌‌‌‌‌), షౌ హోప్‌‌‌‌‌‌‌‌ (14 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించారు. 

ఈ దశలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఔట్ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సకీబ్‌‌‌‌‌‌‌‌ మహ్మూద్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.