డెడ్ బాడీ పార్శిల్ డెలివరీ మిస్టరీ వీడింది.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి ట్విస్టులు..

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల అందరిని షాక్ కి గురి చేసిన డెడ్ బాడీ పార్శిల్ డెలివరీ ఘటన మిస్టరీ వీడింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు కేసు మిస్టరీని ఛేదించారు. ఆస్తి కోసమే ఈ హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. ఆస్తి కోసం వదినను భయపెట్టేందుకు ఆమె మరిది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు పోలీసులు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ ఘటనలో ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

రంగరాజు అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు కాగా.. వారిలో తులసి ఇంటికి ఈ డెడ్ బాడీ పార్శిల్ డెలివరీ అయ్యింది. ఆమె చెల్లెలు రేవతి భర్త శ్రీధర్ వర్మ తన ప్రియురాలు సుష్మ, భార్యతో కలిసి పర్లయ్య అనే వ్యక్తిని నైలాన్ తాడుతో చంపేసి.. శవాన్ని తులసి ఇంటికి పంపినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఇందులో శ్రీధర్ వర్మ భార్య తులసి, ప్రియురాలు సుష్మతో పాటు మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. సుష్మకు కూడా మూడు పెళ్లిళ్లు జరగడం ఇక్కడ మరో ట్విస్ట్.

ALSO READ | Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

ఇదిలా ఉండగా.. ఈ కేసుతో సంబంధం లేని పర్లయ్య అనే అమాయకుడిని ఎందుకు చంపారన్నది మిస్టరీగా మారింది. పర్లయ్యను శ్రీధర్ వర్మ, రేవతి, సుష్మ కలిసి హత్య చేసి శవాన్ని తులసి ఇంటికి పంపారు. తండ్రి రంగరాజు ఆస్తిలో వాటా కోసం తులసి రాకుండా భయపెట్టేందుకే ఈ పని చేసినట్లు వారు దర్యాప్తులో నిందితులు అంగీకరించినట్లు తెలిపారు పోలీసులు. మొత్తానికి శవాన్ని పార్శీల్ లో పంపి బయపెట్టాలని చూసినప్పటికీ తులసి భయపడకుండా పోలీసులను ఆశ్రయించటం.. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 100 మంది పోలీసుల బృందంతో వేగంగా దర్యాప్తు చేయడంతో నిందితుల ప్లాన్ ఫెయిల్ అయ్యింది.