డిసెంబర్ 13 నుంచి పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

మక్తల్, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన మక్తల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. శుక్రవారం ఉదయం 8గంటలకు అంకురార్పణతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు నిర్వహించనున్నట్లు ఈవో శ్యాం సుందరచారి, ఆలయ ధర్మకర్త ప్రాణేష చారి తెలిపారు.

 ఈ బ్రహ్మోత్సవాలకు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపీలకు చెందిన వేలాది మంది హాజరవుతారు. శ్రీపడమటి అంజనేయ స్వామి ఎంతో మహిమగలవారని ప్రజలు నమ్ముతుంటారు. ఈ టెంపుల్ కు ప్రతి మంగళవారం, శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆలయంలో స్వామి వారు 11 అడుగుల నిలువెత్తు రూపంలో దర్శనమిస్తుంటాడు. బ్రహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.