వెల్స్ ఫార్గోలో ఉద్యోగాల కోత

వెల్స్ ఫార్గోలో ఉద్యోగాల కోత

వందలాది మందిపై ఎఫెక్ట్

బెంగళూరు : వెల్స్‌‌ ఫార్గో కంపెనీ ఇండియన్ ఉద్యోగులుపై వేటు వేస్తోంది. ఇండియాలోని మూడు డెవలప్‌‌మెంట్ సెంటర్లలో వర్క్‌‌ఫోర్స్‌‌ను తగ్గించడం ప్రారంభించింది. ఈ ప్రభావం వందల మంది ఉద్యోగులపై చూపనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన వెల్స్‌‌ ఫార్గో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్‌‌ను అందిస్తోంది. కంపెనీని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఉద్యోగుల కోత ప్రక్రియను ప్రారంభించింది వెల్స్‌‌ ఫార్గో.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెల్స్ ఫార్గో ఆఫీసుల్లో  సుమారు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని సపోర్టింగ్ ఫంక్షన్స్, టెక్నాలజీ టెస్టింగ్‌‌ల నుంచి అనవసరంగా ఉన్న రోల్స్‌‌ను తగ్గిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.  కంపెనీ ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇచ్చే కొన్ని ప్రోత్సాహకాలను కూడా రద్దు చేసింది. కొంతమందికి వేరే ఉద్యోగాలు వెతుక్కోవాలని కూడా ఇన్‌‌డైరెక్ట్‌‌గా చెప్పినట్టు తెలిసింది. అయితే ఉద్యోగాల కోతపై వెల్స్ ఫార్గో ఎలాంటి ప్రత్యేక వివరాలను బయటికి వెల్లడించలేదు. అనవసరమైన ఉద్యోగుల తొలగింపుతో ఖర్చులను తగ్గించుకుంటామని  అధికార ప్రతినిధి చెప్పారు. తమ వర్క్‌‌ఫోర్స్‌‌లో 5 శాతం నుంచి 10 శాతం  అయితే ఏ బిజినెస్‌‌ యూనిట్‌‌పై ఈ కోత ప్రభావం ఉంటుంది, ఏ ఉద్యోగాలు ఎక్కువగా ఊడనున్నాయో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. వెల్స్‌‌ ఫార్గో మరింత ఉత్సుకతతో పనిచేసేందుకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుందని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Wells Fargo Company is suing Indian employees