మోడీ ఫొటోకు క్షీరాభిషేకం

గద్వాల, వెలుగు: మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్​ సిలిండర్లపై రూ.100 తగ్గించడాన్ని స్వాగతిస్తూ శుక్రవారం బీజేపీ లీడర్లు ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు, బండల పద్మావతి, కృష్ణవేణి, శివారెడ్డి, రజక జయశ్రీ, శ్యామ్  పాల్గొన్నారు.

కల్వకుర్తి: సిలిండర్  రేట్​ తగ్గింపుపై జాతీయ బీసీ కమిషన్  మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని బీజేపీ ఆఫీస్​లో శక్తి కేంద్ర ఇన్​చార్జీల సమావేశంలో పాల్గొన్నారు. ఉజ్వల సబ్సిడీ స్కీమ్​ను పొడిగించడం సంతోషకరమన్నారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఇన్​చార్జి చంద్రశేఖర్, నరసింహ, రాఘవేందర్, దుర్గాప్రసాద్, వివేకానంద, చంద్ర జయపాల్, అభిలాశ్, రాంరెడ్డి పాల్గొన్నారు.