ఇంతకు మించి హింట్ ఇవ్వలేను
డ్రగ్ కంట్రోలర్ జనరల్ సోమని
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ గుడ్ న్యూస్‌తో కొత్త ఏడాదికి ఇండియా వెల్‌కమ్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. దేశంలో అతి త్వరలోనే కరోనా వ్యాక్సినేషన్‌కు అనుమతి వస్తుందని డ్రగ్ కంట్రోలర్ జనరల్ వీజీ సోమని గురువారం వెల్లడించారు. ఓ వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘బహుశా.. ఏదో ఒక వ్యాక్సిన్ పర్మిషన్‌తో కొత్త ఏడాదిని మనం జరుపుకుంటామేమో. ప్రస్తుతానికి నేను ఇంతవరకే హింట్ ఇవ్వగలను’ అని సోమని అన్నారు. టీకా ఎమర్జెన్సీ వాడకంపై నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశం కానుండటంతో సోమని కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ మీటింగ్‌లోనే టీకాకు అనుమతులు వచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
రేపటి భేటీపై ఉత్కంఠ
ప్రభుత్వం అపాయింట్ చేసిన ఎక్స్‌పర్ట్స్ కమిటీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థల నుంచి టీకా అత్యవసర అనుమతి అప్లికేషన్లను ఇప్పటికే తీసుకుంది. వాటిపై చర్చించేందుకు బుధవారం సమావేశమైంది. మరింత లోతుగా చర్చించేందుకు శుక్రవారం మళ్లీ భేటీ కానుంది. టీకాలపై మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా సంస్థలను కోరింది. తాజాగా ప్రధాని మోడీ కూడా కొత్త ఏడాదిలో వ్యాక్సినేషన్ చేపడతామని చెప్పడంతో రేపటి భేటీపై ఉత్కంఠ నెలకొంది.
ఇండియాలో కొవిషీల్డ్, కొవ్యాగ్జిన్
ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా కలిసి డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోంది. భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కలిసి కొవ్యాగ్జిన్‌ను డెవలప్ చేస్తున్నాయి.
For More News..
ఓటుకు నోటు కేసులో చంద్రబాబే డీల్ చేసిండు
మార్చి నుంచి కరోనాతో ఆగమాగం
సాగు సాగుతలేదు.. నెమ్మదించిన వరి నాట్లు
భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు
