న్యూఢిల్లీ:. ఇండియా వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ సీమ డోపీగా తేలింది. దాంతో, ఆమెపై నేషనల్యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగేళ్ల బ్యాన్ విధించింది. విశాఖపట్నంలో జరిగిన నేషనల్ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ సందర్భంగా సేకరించిన శాంపిల్స్‌లో పెర్ఫామెన్స్‌ను పెంచే నిషేధిత ఉత్ప్రేరకాలు సీమ తీసుకున్నట్టు తేలిందని నాడా తెలిపింది. 2017 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో సీమ రజతం సాధించింది.
