మేషం (మార్చి21 – ఏప్రిల్20)
ఆదాయం తగ్గినా అవసరాలు తీరతాయి. కొన్ని సమస్యల్ని నైపుణ్యంగా పరిష్కరించుకుంటారు. వివాహయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటి నిర్మాణాలు ముమ్మరం చేస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు మార్పులను చూడాల్సి వస్తుంది.
వృషభం (ఏప్రిల్21 – మే21)
ముఖ్యకార్యాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. నూతన ఉద్యోగాల అన్వేషణలో జాప్యం. తరచూ ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు శ్రమపడాల్సిన సమయం. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. కుటుంబ బాధ్యతలు పెరిగి పరీక్షగా మారవచ్చు. యుక్తితో సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు జరగవచ్చు.
మిథునం (మే22 – జూన్22)
మీ మనోగతాన్ని కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అందరిలోనూ ప్రత్యేక గౌరవం. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. హోదాలు, పదవుల్లో ఉన్న వారిని కలుస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు.
కర్కాటకం (జూన్23 – జూలై23)
చిరపరిచితులు మీకు చేదోడుగా నిలుస్తారు. ప్రముఖులతో చర్చలు. గతం గుర్తుకొస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. అరుదైన ఆహ్వానాలు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. రాబడి అనుకూలం. కోర్టు వివాదాలు తుది దశకు చేరుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అనుకోని పెట్టుబడులు. భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
సింహం (జూలై24 – ఆగస్టు22)
నేర్పు, ఓర్పు మీకు ఆభరణాలు. చేపట్టిన కార్యాలు కొన్ని వాయిదా. తరచూ ప్రయాణాలు ఉండవచ్చు. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు. మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. శత్రువులు సైతం స్నేహితులుగా మారతారు. వాహనయోగం. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం.
కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్22)
చేపట్టిన కార్యాలు నిదానంగా పూర్తి. శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. మీ సేవలకు తగిన గుర్తింపు. ఆదాయం ఆశాజనకం. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆశయ సాధన దిశగా అడుగులు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుతాయి.
తుల (సెప్టెంబర్23 – అక్టోబర్22)
మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. నిర్ణయాలు సైతం అందర్నీ ఆకర్షిస్తాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయం. భూములు, వాహనాలు కొంటారు. శత్రువిజయం. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు.
వృశ్చికం (అక్టోబర్23– నవంబర్22)
స్నేహితుల సహకారంతో ముఖ్య కార్యాల పూర్తి. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబసభ్యులతో సఖ్యత. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగయత్నాలలో విజయం. ఎంతటి సమస్య ఎదురైనా లెక్కచేయరు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారులు శ్రద్ధ వహిస్తే లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది.
ధనుస్సు (నవంబర్23 – డిసెంబర్22)
కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆదాయం సమకూరినా అప్పులు కూడా చేస్తారు. బంధువులు, స్నేహితులతో కొన్ని వివాదాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తరచూ ప్రయాణాలు సంభవం. చాకచక్యంగా వ్యవహరించాలి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారుల యత్నాలు సఫలం. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి.
మకరం (డిసెంబర్23 – జనవరి22)
అదనపు ఆదాయం. ఆసక్తికర సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యాలు విజయవంతం. కుటుంబ సభ్యులు మీపై కొత్త బాధ్యతలు ఉంచుతారు. విద్యార్థులు నైపుణ్యత చాటుకుంటారు. చిత్రవిచిత్ర మైన విషయాలు తెలుస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలపై అంతా సంతృప్తి వ్యక్తం చేస్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)
సత్తా, సమర్ధత చాటుకుంటారు. ఆదాయం విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనాలనే యత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. ప్రముఖుల పరిచయం. మనసులోని కోరికలు ఫలించే సమయం. వ్యాపారులకు పెట్టుబడుల్లో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు కూడా సమర్థంగా నిర్వహిస్తారు.
మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)
ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆదాయం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు చేజారతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు మరిన్ని లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లు అధిగమిస్తారు.
వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్: 98852 99400
