వారఫలాలు ( సౌరమానం) అక్టోబర్ 06 నుంచి 12 వరకు

మేషం : ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయి. వాహనయోగం. కోర్టు వ్యవహారాలు కీలక దశకు చేరతాయి. ఉద్యోగయత్నాల్లో నిరుద్యోగులకు విజయం. పోటీపరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత. వ్యాపారంలో భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణ అనుకూలిస్తుంది. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకునే దిశగా ముందుకు సాగుతారు.

వృషభం : ఇతరుల నుంచి సహాయ సహకారాలు. యత్నకార్యసిద్ధి. అనుకున్న రాబడి. ఆస్తుల వ్యవహారాల్లో అనుకూలత. తండ్రి నుంచి ప్రతికూలత ఎదురైనా ఆత్మవిశ్వాసంతో సర్దుబాటు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. సాంకేతిక, వైద్య రంగాల్లో నిరుద్యోగులకు ఉపాధి లభించే ఛాన్స్‌. కొత్త భాగస్వాములు, పెట్టుబడులతో వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు. కళాకారులు, రాజకీయవేత్తల యత్నాలు సఫలం.

మిథునం : రాబడి విషయంలో లోటు లేకున్నా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా. వాహనాలు, స్థలాలు కొంటారు. క్రీడాకారులు అనుకున్న విజయాల వైపు పయనం. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. బంధువులతో సత్సంబంధాలు. వ్యాపారాల్లో భాగస్వాములతో నెలకొన్న వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ఉద్యోగాల్లో సమర్థత నిరూపించుకునేందుకు తగిన సమయం. పారిశ్రామికవేత్తలకు అనుకున్న పెట్టుబడులు.

కర్కాటకం : అదనపు ఆదాయం. రుణబాధల నుంచి విముక్తి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై మరింత ప్రేమ, ఆదరణ చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చేజారిన వస్తువులు, డాక్యుమెంట్లు లభిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు.  కళాకారులు, రాజకీయవేత్తలు సత్తా చాటుకునే అవకాశం.

సింహం : స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. ఆదాయం  సమృద్ధిగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు చేదోడుగా నిలుస్తారు. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించే సమయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. నిర్ణయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో మీ సమర్థతకు పైస్థాయిలో గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం. నూతన కంపెనీల ఏర్పాటులో విజయం.

కన్య : ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు క్రమేపీ తొలగుతాయి. అనుకున్న రాబడి ఉన్నా వృథా ఖర్చులు. ఆప్తులు, ప్రియతముల నుంచి శుభవార్తలు. భూములు క్రయవిక్రయాల్లో ఆశించిన లాభాలు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపా రాల నిమిత్తం కొత్త భాగస్వాములతో చర్చలు. ఉద్యోగాల్లో కోరుకున్న మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులకు విశేష ఆదరణ.

తుల : ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి. రాబడి కొంత పెరిగినా ఖర్చులు ఉండొచ్చు.  దూరపు బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రమిస్తారు. వివాహాది వేడుకల నిర్వహణపై చర్చిస్తారు. వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగాల్లో ఇష్టంలేని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ కలిగిస్తాయి. వారం మధ్యలో వస్తులాభాలు. ఉద్యోగలాభం.

వృశ్చికం : చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. అనుకున్న రాబడి దక్కుతుంది. విలాసజీవనం సాగిస్తారు. సోదరులు, బంధువుల నుంచి ప్రశంసలు. నిరుద్యోగులకు అవకాశాలు. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. చరస్థిరాస్తుల విక్రయాల్లో లాభాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్త భాగస్వాములు జతకడతారు. ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు, కొత్త కంపెనీల ఏర్పాటులో అగ్రిమెంట్లు.

ధనస్సు : ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థుల విజయపరంపర కొనసాగుతుంది. ఉద్యోగాన్వేషణలో విజయం. రావలసిన బాకీలు వసూలవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. వ్యాపారాల్లో తగాదాల పరిష్కారం. ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని విధంగా విదేశీయానం. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఆశించిన ఫలితాలు.

మకరం : రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. వాక్పటిమ, నేర్పుతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం. నిరుద్యోగులకు అవకాశాలు. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు. స్థిరాస్తి విషయంలో అనుకూలం. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు తోడవుతారు. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

కుంభం : మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. కొత్త సంస్థ ల్లో సభ్యత్వాలు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. నేర్పుతో సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం. వ్యాపారాలు గతం కంటే ఆశాజనకం. ఉద్యోగాల్లో సహచరుల సహకారం. పారిశ్రామికవేత్తలకు అనుమతులు. రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు జరిగే అవకాశం.

మీనం : జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వాహన, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.  విద్యార్థులకు సాంకేతిక, పరిశోధనా రంగాల్లో అవకాశాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400