వారఫలాలు (సౌరమానం)  నవంబర్ 17 నుంచి నవంబర్ 23   వరకు

ఈవారం ( నవంబర్​ 17 నుంచి 23 వ తేది వరకు)  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వృషభరాశి వారికి  అనుకున్న పనులు నెరవేరగా..అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు  . కన్యా రాశికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . .

మేషం:  ఈ రాశి వారికి  అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగస్తుల విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.  కొన్ని సమస్యలు తలెత్తుతాయి.  అయితే పట్టుదలతో  అన్నీ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారస్తులు దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థిక విషయాల్లో అనుకోకుండా ఖర్చులు వస్తాయి. సమయానికి డబ్బు అందుతుంది.  వారం చివరిలో అంతా మంచే జరుగుతుంది. 

వృషభం: ఈ రాశి వారికి కోరుకున్న పనులు నెరవేరతాయి.   ఉద్యోగస్తులకు .. అధికారుల దగ్గరి నుంచి ప్రోత్సాహం ఉంటుంది.  వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. వారం మధ్యలో ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. ముఖ్యమైన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారం సాఫీగా సాగిపోతుంది. 

మిథునం:  ఈ వారం మిథున రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో ఘర్షణలు.. మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి.. వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు.. పెళ్లి ప్రయత్నాలు చేసే వారు శుభ వార్తలు వింటారు. కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశి వారు కొన్ని వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.  డబ్బు ఖర్చు చేసే సమయంలో ఆలోచించండి. పెద్దల సలహాలు పాటించండి.  ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.  వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

సింహం: ఈ రాశి వారు శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా పురోభివృద్దితో పాటు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  శ్వాశకోస వ్యాధులతో బాధపడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు పేర్కొన్నారు. 

కన్యారాశి:  ఈ వారం కన్యారాశి వారికి ముఖ్యమైన అవసరాలు నెరవేరుతాయి.  వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి.. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు పర్యటించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అధికంగా శ్రమపడాల్సి ఉన్నా.. ఆశించిన ఫలితం లభిస్తుంది. అయితే ఆర్థిక వ్యవహారంలో ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వవద్దని పండితులు సూచిస్తున్నారు. 

తుల: ఈ రాశి వారికి  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా... కుటుంబ సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు చేస్తారు.  ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది.  మొండి బకాయిలు వసూలు అవుతాయి.  వృత్తి.. వ్యాపారం.. ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ది ఉంటుంది.  

వృశ్చికం: ఈ రాశి వారికి ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.  కొత్తగా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​.. జీతం పెరిగే అవకాశం ఉంది.  అనుకోకుండా పెళ్లి సంబంధం కుదరుతుంది.  ఈ రాశి వారు కొంతమంది బంధువులు.. స్నేహితుల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది.   అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది.  

ధనుస్సు : ఈ రాశివారు కొత్తగా ఇంటినిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయంలో పురోగతి ఉంటుంది.  వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టేందుకు ఈ వారం సరైన సమయం. వృత్తి .. ఉద్యోగం.. వ్యాపారంలో శుభ పరిమాణాలుంటాయి.  పెళ్లి ప్రయత్నాలు చేసే వారు శుభవార్త వింటారు.  ఆశించిన దానికంటే మంచి సంబంధం కుదిరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  

మకరం: ఈ రాశి వారికి ఈ వారం అనుకోని  పరిస్థితులు ఏర్పడుతాయి.  బంధువులు.. స్నేహితుల సహకారం ఆశించిన రీతితో ఉండదు.  వారం మధ్యలో అనుకూల ఫలితాలు కలుగుతాయి.  ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు.  కొంచెం కష్టపడితే తలపెట్టిన పనులు పూర్తికాగలవు.  ఆర్థికంగా ఎలాంటి మార్పు ఉండదని పండితులు సూచిస్తున్నారు. 

కుంభం: ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది.  ఇప్పటికే మొదలు పెట్టిన పనుల వ్యవహారం కొలిక్కి వస్తుంది.  శ్రమకు తగిన ఫలితంతో పాటు.... కొత్త అగ్రిమెంట్లు చేసుకొనేందుకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో కీర్తి.. గౌరవం లభిస్తాయి.  ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. 

మీనం: ఈ వారం మీన రాశి వారు కొత్తగా వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరగడంతోపాటు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడంతో పాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.  అయితే వారం మధ్యలో కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.