రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు

మేషం : అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆదాయం మరింత దక్కుతుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. చిత్రవిచిత్ర సంఘటనలు. కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుంటారు. విలాసవంతమైన జీవనం. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా నిరూపించుకునే సమయం. షేర్ల మార్కెటింగ్‌లో అభివృద్ధి. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. వ్యాపారులకు నైపుణ్యతతో లాభాలు. ఉద్యోగులకు మరింత గుర్తింపు. రాజకీయవేత్తలు, కళాకారులకు విజయాలు తథ్యం. సాంకేతిక నిపుణులకు విదేశీ పర్యటనలు.

వృషభం : కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. ఆసక్తికర సమాచారం అందుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం. విద్యార్ధులు ఉత్సాహంగా ఉంటారు.  కాంట్రాక్టులు దక్కుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. స్థిరాస్తిపై అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు, ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు. పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 

మిథునం : రాబడికి మించిన ఖర్చులు. తరచూ ప్రయాణాలు. భూవివాదాలు నెలకొన్నా సర్దుబాటుకు యత్నిస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు వ్యాపారులకు పెట్టుబడుల్లో జాప్యం. లాభాల కోసం శ్రమపడాలి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొద్దిపాటి చిక్కులు. సాంకేతిక నిపుణులు తటస్థ వైఖరితో ముందుకు సాగాలి. వారం మధ్యలో విందు వినోదాలు. భూలాభాలు. 

కర్కాటకం : స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడులు తొలగుతాయి. సోదరుల సలహాలు పాటిస్తారు. కాంట్రాక్టర్లకు ఊహించని టెండర్లు దక్కుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో సమర్థత చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పరిశోధకులు పట్టుదలతో విజయాలు సాధిస్తారు.

సింహం : ఈతిబాధలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆదాయం కొంత ఇబ్బంది కలిగించినా క్రమేపీ అనుకూలిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. అనుకున్న కార్యక్రమాలు కొంత నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులకు నూతన  విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి. నిరుద్యోగులకు శుభవర్త మానాలు. కళాకారులకు అవార్డులు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు  ప్రోత్సాహకరం.

కన్య : స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. రాబడి సంతృప్తికరం. దీర్ఘకాలిక సమస్యలు చాలావరకూ పరిష్కారం. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. కొత్త కాంట్రా క్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరం.

తుల : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతలు సవాలుగా మారతాయి. ఆస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. గృహ నిర్మాణ, వివాహ, ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థలతో అగ్రిమెంట్లు. రాజకీయవేత్తలు, సాంకేతిక వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు.

వృశ్చికం : రుణాలు చేస్తారు. బంధువులు మీపై అభాండాలు మోపుతారు. భార్యాభర్తలు, సోదరీసోదరుల మధ్య  కలహాలు. కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు వాయిదా. కాంట్రాక్టర్లు టెండర్లు జారవిడుచుకుంటారు. విద్యార్థులు శ్రమ పడాలి. వ్యాపారులకు లాభాలు ఉండవు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీయానం. రాజకీయవేత్తలు, కళాకారులకు నిరాశ. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.

ధనస్సు : అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం.కాంట్రాక్టర్లు ప్రగతి పథాన సాగుతారు, వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం. విద్యార్థులకు పరిస్థితులు అనుకూలం. వ్యాపారులకు ఆశించిన లాభాలు, ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులు విధుల్లో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలు, నాయకులకు విశేష గుర్తింపు. కళాకారులకు అవార్డులు దక్కుతాయి.

మకరం : అనుకున్న కార్యక్రమాలలో విజయం. తరచూ ప్రయాణాలు. ఆదాయం నిరాశ పర్చినా అవసరాలకు లోటు ఉండదు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టర్లకు అనూహ్యంగా లబ్ధి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విచిత్ర సంఘటనలు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అప్రయత్న అవకాశాలు. పరిశోధకులకు మంచి గుర్తింపు.

కుంభం : ముఖ్య కార్యక్రమాలు నిదానించినా పూర్తి చేస్తారు. ఆలోచనలు అనుకూలిస్తాయి. అపవాదులు, విమర్శలు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారంలో నూతన అగ్రిమెంట్లు. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. ఆశించిన రాబడి. వాహనయోగం. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అప్రయత్న అవకాశాలు. సాంకేతిక నిపుణులు నైపుణ్యతను నిరూపించుకుంటారు.

మీనం : పట్టువిడుపు ధోరణి ఉండాలి. ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రత్యర్థులు, దూరపు బంధువులతో చర్చలు జరుపుతారు. గృహ, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలం. నిరుద్యోగులకు మరింత ఉత్సాహం. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారులకు లాభాలు సామాన్యం. ఉద్యోగులకు మంచి గుర్తింపు. పనిలో అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తల అంచనాలు నిజమవుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం.