రాశిఫలాలు : 2024 మే 12 నుంచి మే 18 వరకు

మేషం : కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సఫలం. శుభకార్యాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు  విధుల్లో అవాంతరాలు తొలగే అవకాశం. రాజకీయవర్గాల వారికి ఒక పిలుపు ఉత్సాహాన్నిస్తుంది. క్రీడాకారులు, కళాకారులకు విశేష ఆదరణ. 

వృషభం : ముఖ్యకార్యాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. పలుకుబడి పెరుగుతుంది. రాబడి ఆశాజనకం. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారం. ప్రత్యర్థులను కూడా దారికి తెచ్చుకుంటారు. స్నేహితులతో తగాదాల పరిష్కారం. నూతన వ్యక్తుల పరిచయం.  విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతన ఒప్పందాలు. క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు.

మిథునం :  కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. భవనాలు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు ఊహించిన లాభాలు. ఉద్యోగులకు ఆశించిన మార్పులు. రాజకీయవర్గాల వారికి పదవులు ఊరిస్తాయి. కళాకారులకు అవకాశాలు అనూహ్యంగా దక్కవచ్చు.  వారారంభంలో దూరప్రయాణాలు. రుణయత్నాలు.

కర్కాటకం :  కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంలో మీదే పైచేయి. పరిస్థితులు అనుకూలిస్తాయి.  చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త పరిశ్రమల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి. కళాకారులకు ఆశాజనకం. వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు.

సింహం : అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమైన కార్యాలు దిగ్విజయం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ప్రత్యర్థులు అనుకూలంగా మారి చేయూత ఇస్తారు. పరిచయాలు విస్తృతం. వాహనాలు, భూములు కొంటారు. ఊహించని విధంగా కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు. 

కన్య : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. మిత్రుల చేయూతతో కొన్ని కార్యాలు చక్కదిద్దుతారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఊహించని రీతిలో ధన, ఆస్తిలాభాలు ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మంచి గుర్తింపు. రాజకీయవర్గాల, క్రీడాకారుల శ్రమ ఫలిస్తుంది. వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు.

తుల : ఉత్సాహంగా ముఖ్యమైన కార్యాలు పూర్తి. సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణాలపై అనుకూల వాతావరణం. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊపిరి పీల్చుకునే అవకాశం. క్రీడాకారులు, పరిశోధకులకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం : పట్టుదలతో విజయాలు సొంతం. ఊహించని  ఆహ్వానాలు. సమాజసేవలో నిమగ్నమవుతారు. రాబడి ఆశాజనకం. అప్పులు తీరతాయి. గృహం, వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కినా సమర్థత చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సందిగ్ధత తొలగుతుంది. క్రీడాకారులు పుంజుకునే సూచనలు.

ధనస్సు : అదనంగా ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో విభేదాల పరిష్కారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.  కొన్ని కార్యాలలో విజయం. వాహనాలు, ఆభరణాలు కొనే వీలుంది. యుక్తి, మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతి బంధకాలు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.

మకరం : ఆదాయం అంతగా కనిపించక నిరాశ చెందుతారు. ముఖ్యమైన కార్యాలు నిదానిస్తాయి. భూవివాదాల పరిష్కారానికి చొరవ చూపుతారు. విద్యార్థుల కష్టానికి ఫలితం కనిపిస్తుంది. బంధువుల కష్టసుఖాలు పంచుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపార లావాదేవీలు కొంతమేర లాభసాటి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం. రాజకీయవర్గాల అంచనాలు నిజమవుతాయి. క్రీడాకారులు, సాంకేతిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం : ఆదాయం గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. ముఖ్య కార్యాలు మొదట్లో నిదానించినా చివరికి పూర్తి. సోదరులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు శ్రీకారం. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని అవకాశాలు సంతృప్తినిస్తాయి.  వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు.

మీనం : ఆదాయానికి లోటు లేకున్నా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని ముఖ్య కార్యక్రమాలు ఎవరి ప్రమేయం లేకుండా పూర్తి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మీ హామీలతో రుణాలు పొందిన వ్యక్తుల వల్ల సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో భాగస్వాముల సహకారం. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. క్రీడాకారులు పరిశోధకులకు అనుకూలమైన సమయం.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400