రాశిఫలాలు : 2024 జూన్ 9 నుంచి 15 వరకు

మేషం : ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు చికాకు పరుస్తాయి.శ్రమ మరింత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. రుణాలు కోసం యత్నిస్తారు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు అతిసామాన్యంగా కొనసాగుతాయి. ఆశించిన లాభాలు కొంత తగ్గుతాయి. ఉద్యోగులకు  విధులలో అవాంతరాలు ఎదురుకావచ్చు. రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగవు. వారం ప్రారంభంలో విందువినోదాలు. ఉద్యోగయోగం. చర్చలు సఫలం.

వృషభం : వివాదాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కక డీలా పడతారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. బంధువులు, సోదరుల సహకారం అడుగుతారు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు. పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. వారం చివరిలో బంధువుల ద్వారా ఆస్తిలాభం. క్రయవిక్రయాలు లాభిస్తాయి. వస్తులాభాలు.

మిథునం : కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. అనుకున్న విధంగా స్నేహితులు సహకరిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. రుణాలు తీరతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు. ఉద్యోగుల సేవలకు గుర్తింపు. పారిశ్రామిక, రాజకీయవేత్తల అంచనాలు నిజమవుతాయి.

కర్కాటకం : పనులు కొన్ని వాయిదా వేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. సొమ్ము కోసం ఇబ్బందులు పడతారు. ఆస్పత్రులు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. లాభాలు తగ్గుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు, ఒత్తిళ్లు. రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. వారం మధ్యలో వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు.

సింహం : ------అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇళ్లు, వాహనాలు కొంటారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. రుణాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభాలు.  వ్యాపారాల్లో లాభాలు. నూతన భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు. సమర్ధత చాటుకుంటారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు.

కన్య : ----మీ ప్రయత్నాలు ఎంతగా ఉన్నా కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రత్యర్థులుగా భావించే వారిపట్ల మెలకువతో వ్యవహరించాలి. ఊహించినదానికంటే తక్కువగా ఆదాయం సమకూరి నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాల్లో రావలసిన పెట్టుబడులు ఆలస్యమవుతాయి. విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పడవచ్చు. వారం చివరిలో ఆకస్మిక ధనలబ్ధి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనయోగం.

తుల : విజయాల బాటలో నడుస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సంఘంలో గుర్తింపు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. అభాండాలు, ఆరోపణలు తొలగుతాయి. ధనలాభాలు. రుణాలు తీరతాయి. మీ సమర్థత నిరూపించుకుంటారు. వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు. ఆశించిన లాభాలు. ఉద్యోగులు బాధ్యతలు తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు  ప్రోత్సాహకరం.

వృశ్చికం : మీ శ్రమ వృథా అవుతుంది. సరైన ఫలితం కనిపించదు. పనులలో ఆటంకాలు సవాలుగా నిలుస్తాయి. విద్యార్థులకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. రావలసిన సొమ్ము అందక కొంత ఇబ్బంది పడతారు. కుటుంబంలో అందరితో మాటపట్టింపులు.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టం. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు విధి నిర్వహణ సవాలుగా మారుతుంది. వారం మధ్యలో శుభవర్తమానాలు. వాహనయోగం. చర్చలు సఫలం.

ధనస్సు : కొత్త విషయాలు తెలుస్తాయి. ఆలోచనలకు కార్య రూపం. మీ సత్తా చాటుకుంటారు.జీవితాశయం నెరవేర్చడంలో సోదరుల సహకారం అందుతుంది. వివాహాది శుభకార్యాలపై కార్యాచరణ రూపొందిస్తారు. మీకు రావాల్సిన బాకీ మొత్తం అందుతుంది.  సోదరులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారులకు అనుకున్న లాభాలు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల్లో మీసేవలకు తగిన గుర్తింపు. పారిశ్రామికవేత్తల, కళాకారుల అంచనాలు నిజమవుతాయి. వారారంభంలో ఖర్చులు. అనుకోని ప్రయాణాలు.

మకరం : ----ఎంతటి పనైనా పట్టుదల, నేర్పుతో పూర్తి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. నిబిడీకృతమైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. ఆకస్మిక ధనలాభాలు. కుటుంబసభ్యులతో వివాదాల సర్దుబాటు. వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు బాగుంటుంది.

కుంభం : --అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆలోచనలు కలసిరావు. స్నేహితులు శత్రువుల్లా మారతారు. కొందరు మీ సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తారు.విచిత్ర సంఘటనలు. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారులకు పెట్టుబడుల్లో జాప్యం. లాభాలు కనిపించవు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ప్రయాణాలు లాభిస్తాయి. వింత సంఘటనలు ఎదురవుతాయి.

మీనం : కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. అందరిలో గుర్తింపు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబసభ్యులు మీ నిర్ణయాలు స్వాగతిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. నూతన భాగస్వాములు చేరతారు. ఉద్యోగాల్లో పైస్థాయి వారి ప్రశంసలు. ప్రమోషన్‌ అవకాశాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400

==================================================================