వారఫలాలు ( సౌరమానం) జూన్ 30 నుంచి జులై 6 వరకు

మేషం : చేపట్టిన కార్యక్రమాలలో గందరగోళం తొలగుతుంది. బంధువులే శత్రువులుగా మారే సమయం. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకోవడంలో శ్రమపడాలి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో అనుకోని ధనలాభం. కార్యసిద్ధి. శుభవార్తలు.

వృషభం : కొత్త అంచనాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. సమాజంలో కీర్తి దక్కించుకుంటారు. ముఖ్య నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. వ్యాపారులు క్రమేపీ లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిభారం కొంత పెరుగుతుంది. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కుతాయి. పరిశోధకులు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

మిధునం : ఆదాయం నిరాశ కలిగించినా అవసరాలకు స్నేహితులు ఆదుకుంటారు. కష్టపడ్డా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు సమకూరతాయి. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు. వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం : కొన్ని  కార్యక్రమాలలో విజయం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది. అదనపు ఆదాయంతో అవసరాలు తీరతాయి. వ్యాపారులకు వ్యూహాలు ఫలిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలకు సంతోషదాయకమైన కాలం.  కళాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.

సింహం : నూతన ఉద్యోగావకాశాలు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో  అవాంతరాలు తొలగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. భూసంబంధ వివాదాల నుంచి కొంత విముక్తి. చర్చలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామికవేత్తలకు కొంత అనుకూల సమయం. వారాంతంలో స్వల్ప ధనలబ్ధి.

కన్య : నూతన విషయాలు తెలుసుకుంటారు. సమర్థతకు గుర్తింపు. చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్థలాలు, వాహనాలు కొంటారు. రాబడి ఆశాజనకం. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గి కొంత ఉపశమనం. రాజకీయవేత్తలకు కొత్త పదవులు ఊరిస్తాయి. వారారంభంలో  ప్రయాణాలు.

తుల : అవసరాలకు డబ్బు అందుతుంది. కొన్ని సమస్యలు తీరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సమాజంలో గౌరవప్రతిష్టలు. ఆకస్మిక ప్రయాణ సూచనలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు నిదానంగా సాగిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. రాజకీయవేత్తలు కొత్త పదవులు దక్కించుకుంటారు.

వృశ్చికం : అదనపు ఆదాయం. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఒక సమస్య లేదా వివాదాన్ని నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.  పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం.  వ్యాపారాలలో లాభాలు. కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగుతాయి. విశేష గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం.

ధనస్సు : కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి. ఆదాయం ఆశాజనకం. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితులతో ఆసక్తికర విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు.  కొత్త వ్యాపారాలు విజయవంతంగా కొనసాగిస్తారు. ఉద్యోగులకు ఊహించని రీతిలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు.

మకరం : ఆశించిన ఆదాయం సమకూరినా ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యాలపై చర్చలు సఫలం. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. నూతన ఉద్యోగయత్నాలలో పురోగతి. వ్యాపారులకు విస్తరణ యత్నాలు సఫలం. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూలం. కళాకారులు, క్రీడాకారుల సమస్యలు తీరతాయి..

కుంభం : రాబడి, ఖర్చులు సమానం. కొన్ని కార్యక్రమాలు విజయవంతం. స్థిరాస్తి విషయాల్లో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారులకు నూతనోత్సాహం.  ఉద్యోగులు పనిభారం నుంచి బయటపడతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి.

మీనం :  సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆదాయం మెరుగుపడి ఉత్సాహంగా ఉంటుంది.  పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.  వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. భాగస్వాములతో కొత్త ఒప్పందాలు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400