వారఫలాలు ( సౌరమానం) జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు

మేషం : కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. మీ పరిశోధనలు, కృషికి తగిన గుర్తింపు. కుటుంబంలో వివాహాది వేడుకలు వాయిదా. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు.

వృషభం : కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆలోచనలకు కార్యరూపం. భూములు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ప్రముఖులతో పరిచయాలు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారులకు కొత్త భాగస్వామ్యం. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరం. వారాంతంలో విచిత్రమైన సంఘటనలు.

మిథునం : కొంత జాప్యం జరిగినా చేపట్టిన కార్యాలు  పూర్తి కాగలవు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరుతుంది. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. అవసరాలకు తగిన సొమ్ము అందుతుంది. కుటుంబంలో మీపట్ల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారులకు అందిన లాభాలతో సంతృప్తి. ఉద్యోగులకు ఉత్సాహం.  కళాకారులకు కార్యసిద్ధి.

కర్కాటకం : ముఖ్య కార్యక్రమాల్లో ముందడుగు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. భూములు, వాహనాలు కొంటారు. ఆదాయానికి  లోటు ఉండదు. కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. రాజకీయవర్గాలకు గుర్తింపు. వారాంతంలో అనుకోని ఖర్చులు. స్నేహితుల నుంచి ఒత్తిడులు.

సింహం : కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి. వాహనాలు, స్థలాలు కొంటారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. ఇంటాబయటా బిజీగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు బకాయిలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు అప్రయత్నంగా అవకాశాలు. వారం మధ్యలో ఖర్చులు అధికం.

కన్య : కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విచిత్రమైన సంఘటనలు. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. శుభకార్యాలు క్లుప్తంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా ఉత్సాహం తగ్గదు. రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు రావచ్చు. వారారంభంలో అనుకోని ఖర్చులు. లేనిపోని వివాదాలు.

తుల : ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి. మనసు నుంచి భయాందోళనలు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆలోచనలకు కార్యరూపం. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. భూములు, ఇళ్లు కొంటారు. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగుల కృషి  ఫలిస్తుంది, విధుల్లో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం : బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. రావలసిన సొమ్ము అందదు. కుటుంబ సమస్యలు కొంతమేర పరిష్కారం. స్థిరాస్తి వివాదాలు చికాకుపరుస్తాయి. వ్యాపారులకు లాభాలు అంతంత మాత్రం. ఉద్యోగులకు అదనపు విధులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.

ధనస్సు :  ఎటువంటి కార్యం అయినా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడే మార్గం కనుగొంటారు. ఆదాయం సంతృప్తికరం. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై ప్రణాళిక రూపొందిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు వివాదాలు తొలగుతాయి. 

మకరం : కొత్త వ్యక్తులతో పరిచయం. ఊహించని శుభవార్తలు. శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కోర్టు కేసులు చివరి దశకు చేరతాయి. వాహనాలు, గృహం కొంటారు. అదనపు ఆదాయం. కుటుంబసభ్యుల సాయం అందుతుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలకు సామాన్యం.

కుంభం : కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి.  ఆదాయానికి సమానంగా ఖర్చులు ఉంటాయి. శత్రువులను అనుకూలంగా మార్చుకుంటారు. భూముల కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా గట్టెక్కుతారు. ఇతరులకు ఇచ్చిన హామీలు నిలుపుకుంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు అనుకోని అభివృద్ధి. రాజకీయవర్గాలకు కొంత అనుకూల పరిస్థితులు.

మీనం : కొన్ని కార్యాలు ప్రారంభంలో నిరాశ కలిగించినా చివరికి పూర్తి. ఆలోచనలు అమలు చేస్తారు. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రత్యర్థులు స్నేహితులవుతారు. ఖర్చులను తట్టుకునే ఆదాయం. వ్యాపారులకు లాభాలు, విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. 

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400