వారఫలాలు( సౌరమానం) ఆగస్టు 18 నుంచి 24 వరకు

మేషం: ముఖ్యమైన కార్యక్రమాలను సాఫీగా పూర్తి. సలహాలు స్వీకరిస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనల అమలులో బంధువులు సహకారం. ఇంటి నిర్మాణాల్లో సమస్యలు తీరతాయి. అనుకోని ధనలాభాలు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు.  మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. 

వృషభం: ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలో పూర్తి. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ప్రత్యర్థులను ఆకర్షిస్తారు. కొన్ని  సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. అవసరాలకు ఊహించని విధంగా డబ్బు అందుతుంది. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరం.

మిథునం: ముఖ్య కార్యాలలో  విజయం. ప్రముఖులతో పరిచయాలు. చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. భూములు కొంటారు. ఆదాయం క్రమేపీ మెరుగుపడుతుంది. కొన్ని అప్పులు తీరే అవకాశం. కుటుంబసభ్యులతో విభేదాలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం: ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ముఖ్య కార్యక్రమాలు విజయవంతం. ఆత్మీయులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు. అవసరాలకు సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు పూర్తి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. క్రీడాకారులు, పరిశోధకులకు కొత్త అవకాశాలు.  వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి.

సింహం: కొత్త కార్యాలు సమయానికి పూర్తి. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. అవసరాలకు తగినంతగా ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక అప్పులు తీరతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని పిలుపు.

కన్య: కొత్త  ఆలోచనలతో రంగంలోకి దిగుతారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి స్నేహితులనుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తుల  విషయంలో చికాకులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సమకూరుతుంది. సోదరీల నుంచి అందిన సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడి, ఇబ్బందుల నుంచి విముక్తి.

తుల: కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు.  సమాజంలో ప్రత్యేక గుర్తింపు.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. తరచూ ధనలాభాలు. సోదరులతో విభేదాలు తీరతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందవచ్చు. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహం. క్రీడాకారుల యత్నాలు సఫలం. వారారంభంలో దూరప్రయాణాలు.

వృశ్చికం: ఆత్మీయులే శత్రువులుగా మారడంతో కలత చెందుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంతగా కష్టించినా ఫలితం శూన్యం. విద్యార్థులు, నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. రావలసిన సొమ్ము సమయానికి అందక   అప్పులు చేస్తారు. వ్యాపారులకు కొన్ని వివాదాలు. ఉద్యోగులకు తరచూ మార్పులు. వారాంతంలో శుభవార్తలు. వాహనయోగం.

ధనస్సు: ఆటంకాలు తొలగి అనుకున్న  కార్యాలు పూర్తి. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. వ్యాపారులకు క్రమేపీ ప్రోత్సాహకరం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పైస్థాయి నుంచి ప్రశంసలు కురుస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూల వాతావరణం. క్రీడాకారులకు కొత్త అవకాశాలు.

మకరం: పొరపాట్లు సరిదిద్దుకుని  కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. సమాజంలో ఆదరణ.  స్నేహితులతో విభేదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆశించిన ఆదాయం. అప్పులు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అప్రయత్న అవకాశాలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఆశించిన ప్రగతి.

కుంభం: అనుకున్న కార్యాలు సమయానికి పూర్తి. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రాబడి సమయానికి సమకూరి అప్పులు తీరతాయి. వ్యాపారులకు క్రమేపీ లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగి ఉపశమనం. కళాకారులు, పరిశోధకులకు అనుకూలం. రాజకీయవేత్తలకు కొన్ని పదవులు ఊరిస్తాయి.

మీనం: చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా  పూర్తి. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. హోదాలు కలిగిన వారు సాయపడతారు. రాబడి ఆశాజనకం. దూరపు బంధువులతో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులను బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరాశాజనకం. వారారంభంలో దూరప్రయాణాలు. 

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400