ఈవారం ( డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 07 వరకు ) జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం .. మిధునరాశి వారు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉండగా.. సింహరాశి వారు భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు.. తులారాశి వారికి పనిబాధ్యతలు పెరిగే అవకాశం ఉంది... ధనస్సు రాశి వారు ఉద్యోగం మారే అవకాశం ఉంది. గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యుల అంచనా ప్రకారం.. ఈ వారం ( డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 07 వరకు) 12 రాశుల ఫలితాలను తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం ( డిసెంబర్ 1 నుంచి 7 వరకు) మిశ్రమ ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులుచెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది. పెళ్లి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి.. వ్యాపారం... ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కొద్దిపాటి పెరుగుదల ఉండే అవకాశం ఉంది.
వృషభరాశి: ఈ వారం వృషభరాశి వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి.. వ్యాపారస్తులు... ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తారు. కాని పెడితే మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు .. తోటి ఉద్యోగులు సహకారం అందిస్తారు. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
మిధున రాశి: ఈ రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. కొత్తగా ఆస్తిని కొనుగోలు చేసేందుకు ఈ వారం ( డిసెంబర్ 1 నుంచి 7 వరకు) మంచి అనుకూల సమయం. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది అనుకూల సమయం. అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. వృత్తి పరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి : ఈ రాశి వారు... ఈ వారం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. వారం చివరిలో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేందుకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వారం చివరిలో లాభాలు గడిస్తారు. షేర్ మార్కెట్ వ్యాపారం చేసే వారికి కలసి వస్తుంది. ఉద్యోగంలో ప్రశాంతతో పాటు.. కుటుంబసభ్యుల కోసం సమయం కేటాయిస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
సింహ రాశి: ఈ రాశి వారు భవిష్యత్ విషయంలో మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.ప్రేమ విషయాలు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు రాకపోయినా .. నష్టం మాత్రం ఉండదు. అనుకోకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంది.
కన్యా రాశి: ఈ రాశి వారికి ...ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ వారం కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. వాహనాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. పెళ్లి కోసం ఎదురుచూసే వారు శుభవార్త వింటారు. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వవద్దు. వృత్తి, ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పూర్వీకుల ఆస్తి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనుకోకుండా తీసుకున్న నిర్ణయం.. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది.
తులా రాశి: ఈ రాశి వారికి డిసెంబర్ 1 నుంచి 7 వరకు పనిబాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. కష్టపడకుంగా ఎలాంటి పురోగతి ఉండదు అనే విషయాన్ని గ్రహించాలి. కుటుంబసభ్యుల మధ్య స్వల్ప వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వారం చివరిలో అన్ని సమసిపోతాయి. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినా .. సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. చేతి వృత్తుల వారు కష్టపడాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ వారం సంతోషంగా గడుతుపుతారు. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఆఫీసులో తోటి ఉద్యోగుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణం కలసి వస్తుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనికి పరిష్కార మార్గం లభిస్తుంది. ఆర్థిక విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి సంబంధం కుదురుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. టెక్నికల్ కోర్సుల పట్ల ఆశక్తి కనపరుస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీకు ప్రశంసలు లభిస్తాయి. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జీవితభాగస్వామి సలహా తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు గడిస్తారు. ఇప్పటి వరకు రాని మొండి బకాయిలు వసూలు కావడంతో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి : ఈ రాశి వారు ... వారు చేసే పనిలో మంచి ప్రతిభ కనపరుస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. ప్రేమవివాహం ఫలిస్తుంది. ఆస్తి విషయాల్లో ఈ వారం ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెడితే లాభం వచ్చే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కుంభ రాశి: ఈ వారం కుంభరాశి వారికి అనుకోని ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు .. సహోద్యోగుల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రేమ విషయంలో లైన్ క్లియర్ అవుతుంది. ఎవరికి అప్పులు ఇవ్వవవద్దు. పనిభారం అధికమవుతుంది. అయినా ఎలాంటి ఇబ్బంది ఉందదు. వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టేందుకు వెనుకా..ముందు ఆలోచిస్తారు.. ధైర్యం చేసి పెట్టుబడి పెట్టుబడి పెట్టంది. భవిష్యత్తులో ఇదే మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆర్థిక విషయంలో ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మీనరాశి: ఈ రాశి వారు ఈ వారం కష్టడాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. పూర్వీకుల ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు ఊహకు అందని లాభాలొస్తాయి. అయితే ఈ వారం కొన్నిసార్లు మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ సహోద్యోగులను నొప్పించే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.