Horoscope: వారఫలాలు.. ఆగస్టు 25 నుంచి 31 వరకు

మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలో గుర్తింపు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. ఊహించని విజయాలు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. కొన్ని వివాదాల పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.

వృషభం: సమస్యలను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాబడి సంతృప్తికరం. అంచనాలు నిజం కాగలవు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ప్రముఖులతో పరిచయాలు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారులకు క్రమేపీ లాభాలు. ఉద్యోగులకు పోస్టులు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు.

మిథునం: వ్యయప్రయాసల నుంచి ఉపశమనం. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలం. బాకీల వసూలు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కే అవకాశం, విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు శుభవార్తలు. 

కర్కాటకం: కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రత్యేక ఆదరణ. పరిచయాలు పెరుగుతాయి. అరుదైన ఆహ్వానాలు. భూములు, ఆభరణాలు కొంటారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. కష్టానికి ఫలితం దక్కుతుంది. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. క్రీడాకారులకు కాస్త ఊరట.

సింహం: ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. రాబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. గృహ నిర్మాణాల్లో ముందడుగు. ఆలోచనల అమలు. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

కన్య: చిత్రవిచిత్ర సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త పోస్టులు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కీలక సమాచారం. మీ వ్యూహాలు కొన్ని నిజమవుతాయి.

తుల: కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు మరింత లాభపడతారు. ఉద్యోగులకు హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.

వృశ్చికం: రాబడి, ఖర్చులు సమానస్థాయిలో ఉండవచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటి నిర్మాణాల ఆలోచన విరమిస్తారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారులకు లాభాలు తథ్యం, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో సమస్యలు తీరతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల అంచనాలు నిజమవుతాయి.

ధనస్సు: కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం ఆశాజనకం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. వ్యాపారులకు క్రమేపీ లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు. 

మకరం: ఆదాయం కొంత తగ్గి అప్పులు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, స్నేహితులతో అకారణ తగాదాలు. స్థిరాస్తి వివాదాలు సహనాన్ని పరీక్షిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్పదు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు సంభవం. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాల్లో పొరపాట్లు. వారం మధ్యలో శుభవార్తలు, వాహనయోగం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కుంభం: ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సమాజంలో గౌరవమర్యాదలు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. కొన్ని సమస్యలు తీరతాయి. ఆదాయం ఆశాజనకం. కొన్ని విషయాల్లో అంచనాలు నిజమవుతాయి. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు గుర్తింపు.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాబడి ఆశాజనకం. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. సమాజసేవలో భాగస్వాములవుతారు. పలుకుబడి పెరుగుతుంది. చిత్రమైన సంఘటనలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400