Weekly Horoscope: మే 7 నుంచి 13 వరకు రాశి ఫలాలు

Weekly Horoscope: మే 7 నుంచి 13 వరకు రాశి ఫలాలు
  • వార ఫలాలు ( సౌరమానం) 07.05.2023 నుంచి 13.05.2023 వరకు 

మేషం
అవసరాలకు డబ్బు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని  వాయిదా వేస్తారు. కుటుంబంలో  ఒత్తిడులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురుకావచ్చు. మీ నిర్ణయాలను మార్చుకుంటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు దక్కక నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. వారారంభంలో శుభవార్తలు. వాహనయోగం.

వృషభం

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. యుక్తిగా వ్యవహరించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలకు కార్యరూపం. సమాజంలో గౌరవానికి లోటు ఉండదు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారులు మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు చికాకులు చాలావరకూ తొలగే సమయం.

మిథునం

రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు. కొన్ని వ్యవహారాలపై సోదరులతో చర్చిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనుకూలం. వ్యాపారులకు ఉత్సాహవంతం. కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు కొత్త అనుమతులు లభిస్తాయి.

కర్కాటకం

అనుకున్న కార్యాలు చక్కదిద్దుతారు. పలుకుబడి పెరుగుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. బంధువులతో తగాదాలు తీరుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి.  వాహనసౌఖ్యం. ఇంటిలో సంతోషకర వాతావరణం. రాబడికి లోటు ఉండదు. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు సమర్థత నిరూపించుకుంటారు. 

సింహం

అదనపు ఆదాయం. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలకు కార్యరూపం. నిరుద్యోగులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమాచారం. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం నుంచి విముక్తి.

కన్య

రాబడి తగ్గి అప్పులు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకోండి. సోదరులతో ఆస్తి వివాదాలు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. ప్రతివిషయంలో యుక్తిగా వ్యవహరించాలి. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధుల్లో కొత్త బాధ్యతలు. వారం మధ్యలో శుభకార్యాల సందడి. వస్తులాభాలు. 

తుల

ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ప్రముఖ వ్యక్తుల పరిచయంతో ఉత్సాహంగా గడుపుతారు. అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకోవడంలో సఫలమవుతారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి.

వృశ్చికం

రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. కుటుంబంలో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. అందరిలోనూ విశేష ఆదరణ. వాహనాలు, భూములు కొంటారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఊహించని ఆహ్వానాలు. విద్యార్థులకు ఊరట. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం.  

ధనుస్సు

ఆదాయానికి మించిన ఖర్చులు. కుటుంబసభ్యులతో మాటపడతారు. ప్రయాణాల్లో మార్పులు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కష్టం మీది, ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో  అంచనాలు తప్పుతాయి. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారులకు ఇబ్బందులు ఎదురై పరీక్షగా మారతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. వారాంతంలో శుభవార్తలు. ధనలబ్ధి. 

మకరం

రాబడి అంతంత మాత్రం. అప్పులు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, స్నేహితులతో వివాదాలు. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. కొన్ని కార్యక్రమాలు మధ్యలో వాయిదా. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కొంత నిరాశాజనకం. వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీద పడవచ్చు. వారాంతంలో  శుభవార్తలు. ధనలాభం. 

కుంభం

ఆదాయం తగ్గినా అవసరాలు తీరతాయి. బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు పెట్టుబడులు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన మార్పులు. వారారంభంలో ఆస్తిలాభం. కీలక నిర్ణయాలు. 

మీనం

ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత జాప్యం. భూవివాదాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆదాయం అంతగా కనిపించదు. ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తుంది. ముఖ్య నిర్ణయాలలో మార్పులు. నిరుద్యోగులకు అవకాశాలు అంతగా అనుకూలించవు. వ్యాపారులు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధులపై మరింత శ్రద్ధ పెట్టాలి. వారం మధ్యలో  వస్తులాభాలు. వాహనసౌఖ్యం..