
మేషం : ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. వాహనాల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు సఫలం.
వృషభం : రావలసిన డబ్బు సమయానికి అందదు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. పెట్టుబడులు ఆలస్యం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులకు కొన్ని చికాకులు. వారం మధ్యలో వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. శుభవార్తలు.
మిధునం : చేపట్టిన కార్యక్రమాలు నిదానిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులు సాయపడతారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. రాబడి తగ్గుతుంది. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొంత గందరగోళం. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. వారారంభంలో ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలాభం.
కర్కాటకం : రావలసిన సొమ్ము అందక ఇబ్బందిపడతారు. కొన్ని నిర్ణయాలపై పునరాలోచన చేస్తారు. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు. వ్యాపారులకు సాధారణ లాభాలు. భాగస్వాములతో వివాదాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో వాహనయోగం. శుభకార్యాలు నిర్వహిస్తారు.
సింహం : నిర్ణయాలలో నిదానం అవసరం. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు మార్చుకుంటారు. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం వద్దు. రావలసిన సొమ్ము అందడంలో జాప్యం. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. వ్యాపారులకు కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. లాభాలు స్వల్పం. ఉద్యోగులకు స్థానమార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహం. వారాంతంలో శుభవార్తలు. ధనప్రాప్తి.
కన్యా : ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు గందరగోళం నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.
తుల : నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారులకు ఆశించినంత లాభాలు దక్కక నిరాశ చెందుతారు. ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతమవుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు అంచనాలు కొన్ని తప్పుతాయి. వారం మధ్యలో శుభకార్యాల ప్రస్తావన. వస్తులాభాలు.
వృచికం : నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనల అమలు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా మాటలతో ఆకట్టుకుంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు.
ధనస్సు : బాధ్యతలు పట్టుదలతో పూర్తి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమస్యల పరిష్కారంలో చొరవ. భూముల లావాదేవీలలో పురోగతి. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది. కష్టాల నుంచి గట్టెక్కే సమయం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతం.
మకరం : కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇతరులను మాటలతో ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులు మీ నిర్ణయాలను స్వాగతిస్తారు. సమాజంలో గౌరవప్రతిష్టలు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. అదనపు ఆదాయం సమకూరే అవకాశం. శుభకార్యాల నిర్వహణకు సమాయత్తం. వ్యాపారులకు లాభాలతో ఉత్సాహం. ఉద్యోగుల సమర్థత నిరూపణ. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అనుకూలం.
కుంభం : ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. రాబడి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. అందరికీ ఇష్టమైన రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. శారీరక రుగ్మతలు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనే ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు శుభవార్తలు.
మీనం : కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. కుటుంబసమస్యల పరిష్కారంలో చొరవ. వాహనాలు, గృహం కొనే యత్నాలు ముమ్మరం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులపై పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. సమర్థత చాటుకుంటారు. కళాకారులు, రాజకీయవేత్తలకు శుభదాయకమైన కాలం.
వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్: 98852 99400