
మేషం
వ్యూహాత్మకంగా కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఆదాయం ఆశాజనకం. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితులతో సఖ్యత. కొత్త వ్యాపారాల్లో విజయవంతంగా దూసుకెళ్తారు. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు.
వృషభం
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఒక సమస్య అనుకోని విధంగా పరిష్కారం. శుభకార్యాల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. నూతన ఉద్యోగావకాశాలు.
మిథునం
బంధువు నుంచి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకోవడంలో శ్రమపడాలి. విధుల్లో ప్రతిబంధకాలు ఎదురైనా ఉద్యోగులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. ధనలాభం.
కర్కాటకం
ఆర్థికంగా బలం చేకూరుతుంది. చేపట్టిన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి. ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. విధి నిర్వహణలో ప్రోత్సాహం.
సింహం
కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. చేపట్టిన కార్యాలు నిదానిస్తాయి. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రతిభాపాటవాలు ఉన్నా కొంత వెలుగులోకి వస్తాయి. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో పొరపాట్లు దొర్లుతాయి. వారాంతంలో శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు.
కన్య
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆదాయం సమృద్ధి. రుణబాధల నుంచి విముక్తి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి. వ్యాపారులకు లాభాలు ఊరటనిస్తాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.
తుల
అదనపు ఆదాయం. శ్రేయోభిలాషులు సహకరిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుంటారు. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. బాధ్యతలు.
వృశ్చికం
ఆదాయం నిరాశ పరుస్తుంది. కొత్త రుణయత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానిస్తాయి. సన్నిహితుల సాయం కోరతారు. స్థిరాస్తుల విషయంలో వివాదాలు తీరే సమయం. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కుటుంబసభ్యుల వల్ల ఒత్తిడి. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులు సమర్థత నిరూపించుకుంటారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.
ధనుస్సు
ఆర్థిక పరిస్థితి గతం కంటే నిరాశాజనకంగా ఉంటుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. మీ నిర్ణయాలు మార్చుకుంటారు. సోదరులు, సోదరీలతో కొద్దిపాటి విభేదాలు. కోర్టు కేసులు కొన్ని ఊరటనిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు సామాన్య లాభాలు. ఉద్యోగులకు ఇతరుల పని కూడా మీమీదే పడి అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. వారారంభంలో ధనలాభం. కార్యసిద్ధి.
మకరం
కొన్ని కార్యాల్లో స్వల్ప అవాంతరాలు. బంధువులతో విభేదిస్తారు. రాబడి కనిపించక రుణాలు చేస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలు చేపడతారు. వారారంభంలో చిన్ననాటి స్నేహితుల కలయిక. స్థిరాస్తి వృద్ధి.
కుంభం
అదనపు ఆదాయం చేకూరి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. శుభకార్యాల హడావిడి. స్థిరాస్తి విషయాల్లో ఒప్పందాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులు విధుల్లో దూసుకెళ్తారు.
మీనం
చేపట్టిన కార్యాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకున్నది సాధించేందుకు శ్రమపడాలి. గృహ నిర్మాణయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారులకు లాభాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వారారంభంలో వస్తులాభాలు. పాత బాకీలు వసూలు.